Asian Games 2023 Closing Ceremony: 16 రోజులుగా క్రీడాభిమానులను అలరించిన ఆసియా క్రీడలు 2023 ఆదివారంతో ముగిశాయి. సెప్టెంబర్ 23న చైనాలోని హాంగ్జౌ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన 19వ ఆసియా క్రీడలు.. అక్టోబర్ 8న ఘనంగా ముగిశాయి. 80 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన బిగ్ లోటస్ స్టేడియంలో 75 నిమిషాల పాటు ముగింపు వేడుకలు జరిగాయి. 45 దేశాలకు చెందిన క్రీడాకారులు మైదానంలోకి రాగా.. చైనా సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.…
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 199 పరుగులకే ఆలౌటైంది.
హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో రాకెట్లతో దాడి చేశారు. ఇజ్రాయెల్ వైపు నుంచి ప్రతీకార చర్య కూడా వచ్చింది. ప్రస్తుతం చాలా మంది భారతీయ పౌరులు ఇజ్రాయెల్‌లో ఉన్నారు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేపటి మ్యాచ్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించారు. అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలలో తమ దేశంలో కంటే భారతదేశంలో ఎక్కువ వైట్ బాల్ క్రికెట్ ఆడామని, దాని వల్ల ఇక్కడి పిచ్ పరిస్థితులు తనకు బాగా తెలుసన్నారు.
ఆసియా క్రీడల్లో భారత్ ప్రచారం ముగిసింది. ఆసియా క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. 2023 ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు 107 పతకాలు సాధించారు. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత్ 100 పతకాల మార్కును దాటింది. అందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఆసియా క్రీడలు 2023 టోర్నీలో భారత్ హవా కొనసాగిస్తుంది. ఇరాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత పురుషుల కబడ్డీ జట్టు స్వర్ణం గెలిచింది. తీవ్ర ఉత్కంఠ నడుమ 33-29 పాయింట్ల తేడాతో పసడి సాధించారు.
మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ఇస్రో కీలక అప్డేట్ ఇచ్చింది.
ఆసియా క్రీడల్లో భారత్ ఎప్పటికప్పుడు కొత్త చరిత్ర సృష్టిస్తూనే ఉంది. ఆసియా క్రీడల్లో 14వ రోజు కూడా భారత్ పతకాల పరంపరను కొనసాగించింది. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్‌కు చెందిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టిలు దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించి రికార్డు సృష్టించారు. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్ తొలిసారి స్వర్ణం సాధించింది.
రేపు (ఆదివారం) చెన్నై వేదికగా వరల్డ్ కప్‌లో భారత్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవాలనే కసితో భారత్ బరిలోకి దిగుతుంది. మరోవైపు రేపటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై గెలుపొంది.. శుభారంభాన్ని అందించాలని అనుకుంటుంది. ఇక టీమిండియాపై ఆస్ట్రేలియా జట్టుకు మంచి రికార్డులు ఉన్నప్పటికీ.. రేపటి మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.