IND vs NED: వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇండియా-నెదర్లాండ్స్ మధ్య లీగ్ దశలో చివరి మ్యాచ్ జరుగుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముందుగా భారత్ బ్యాటింగ్ కు దిగింది. దీంతో టీమిండియా నెదర్లాండ్ ముందు ఓ భారీ లక్ష్యాన్ని ముందుంచింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగారు. దీంతో స్కోరు భారీగా పరుగులు పెట్టింది.
Read Also: Siddipet: వృద్ధురాలి దారుణ హత్య.. నోట్లో యాసిడ్, గుడ్డలు కుక్కి మరీ..
మొదటగా బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు రోహిత్ శర్మ (61), శుభ్ మాన్ గిల్ (51) అర్థసెంచరీలతో రాణించి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన విరాట్ కోహ్లీ (51) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. తర్వాత శ్రేయాస్ అయ్యర్ 94 బంతుల్లో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఇక.. నెదర్లాండ్స్ బౌలర్లలో డీ లీడ్ 2 వికెట్లు పడగొట్టాడు. వాన్ డెర్ మెర్వ్, పాల్ వాన్ మీకెరన్ తలో వికెట్ సంపాదించారు.
Read Also: HD Kumaraswamy: కర్ణాటక హమీలకే దిక్కులేదు, తెలంగాణలో ఏం చేస్తారు..? సిద్ధరామయ్యపై ఆగ్రహం..