మరికొన్ని గంటల్లో ప్రపంచ కప్ మహా సంగ్రామం ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌కు సంబంధించిన A to Z వివరాలివే.
వన్డే ప్రపంచకప్ గెలవడం ఎంత ముఖ్యమో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కూడా అంతే ముఖ్యమని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. సామాన్యుడు పోటీని చాలా మక్కువతో పట్టించుకుంటాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ప్రపంచకప్ ప్రారంభోత్సవానికి ముందు క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించడం లేదు. స్పోర్ట్స్ వెబ్సైట్ రెవ్ స్పోర్ట్స్ ప్రకారం.. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ బోర్డు ఈసారి ఈ వేడుకను నిర్వహించడం లేదని తెలుస్తోంది.
2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు.. సెమీ ఫైనల్ లోనే ఓటిమిని చవిచూడల్సి వచ్చింది. కానీ ఈసారి ఆసియా గేమ్స్ లో భారత పురుషుల జట్టు ఫైనల్ కు చేరుకుంది. సెమీఫైనల్లో దక్షిణ కొరియాను 5-3తో ఓడించింది. దీంతో.. భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది.
India achieved highest-ever medal tally at Asian Games: చైనా వేదికగా జరుగుతోన్న ఆసియా గేమ్స్ 2023లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్ దక్కింది. కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు స్వర్ణ పతకం వచ్చింది. జ్యోతి సురేఖ వెన్నమ్, ప్రవీణ్ ఓజాస్ డియోటాలే 159-158తో దక్షిణ కొరియాకు చెందిన చైవాన్ సో, జేహూన్ జూలను ఓడించి స్వర్ణం సాధించారు. ఈ ఎడిషన్‌లో ఆర్చరీలో భారతదేశానికి ఇదే మొదటి స్వర్ణం కావడం విశేషం. 35…
ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణాలు సహా 69 పతకాలు సాధించింది. ఆసియా క్రీడల 11వ రోజు అనగా.. అక్టోబర్ 4న భారత్ ఆశలు పెట్టుకున్న బల్లెం వీరుడు నీరజ్ చోప్రా స్వర్ణం కోసం పోటీ పడనున్నాడు.
తూర్పు లడఖ్‌లోని సరిహద్దు రేఖ వద్ద చైనాతో సైనిక ప్రతిష్టంభన ముగిసి, చైనా దళాలు వెనక్కి తగ్గే వరకు భారత వైమానిక దళం వెనక్కి తగ్గదని భారత ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. భారత వైమానిక దళం కార్యాచరణ సన్నాహాలు పూర్తిగా వ్యూహాత్మకంగా మాత్రమే కాకుండా డైనమిక్‌గా కూడా ఉన్నాయని అన్నారు.
కెనడా భారత్‌తో పరిస్థితిని పెంచడానికి చూడటం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం అన్నారు. కెనడా భారత్‌తో బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు.
హిందూ మహాసముద్రంలో శాస్త్రీయ ప్రయోగాలు చేస్తున్న నెపంతో చైనా గూఢచారి నౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతంలోని విస్తారమైన ప్రాంతాల్లో సర్వే చేస్తున్నాయి. ఈ నౌకల నుంచి సేకరించిన డేటా మలక్కా జలసంధి, తూర్పు హిందూ మహాసముద్రం నిస్సార జలాల ద్వారా నావిగేట్ చేయడానికి ప్రయత్నిస్తున్న చైనీస్ జలాంతర్గాములకు అమూల్యమైనది.
ఈ మధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం భూకంపం సంభవించింది.