ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య భారత్- అమెరికాల 5వ ‘టూ ప్లస్ టూ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడంలో ఇరు దేశాలు ఇజ్రాయెల్‌కు బహిరంగంగా మద్దతు తెలిపాయి. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో రక్షణ, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై కూడా చర్చలు జరిగాయి. యుఎస్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో జరిగిన సంభాషణలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యూహాత్మక అంశాలపై ఇరు దేశాలు ఏకీభవిస్తున్నాయని స్పష్టంగా చెప్పారు. రెండు దేశాలు ప్రపంచ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. అలాగే చైనా దూకుడును ఎదుర్కొనేందుకు సంఘీభావం తెలిపారు. ఈ భేటీలో జరిగిన అతి పెద్ద విషయం ఏంటంటే.. పాకిస్థాన్ పేరును కూడా ఇరు దేశాలు ప్రస్తావించలేదు.
Read Also: Telangana: రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండర్లు.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి ప్రకటన
ఇక, ఉగ్రదాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు రెండు దేశాలు సంయుక్తంగా మద్దతు ప్రకటించాయి. ఈ సమావేశంలో భారత్-అమెరికా సమావేశంలో ఏ దేశమూ తమ నేలను ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించడాన్ని అనుమతించకూడదని కూడా పేర్కొన్నారు. లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ప్రకటనతో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం గురించి ప్రముఖంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు భారత్, అమెరికా అండగా ఉంటాయని ఇరు దేశాల మంత్రులు వెల్లడించారు. అంతర్జాతీయ మానవతా చట్టాలకు కట్టుబడి పౌరులకు రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు.
అమెరికా- భారతదేశంలో సాయుధ వాహనాల సహ-ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. న్యూఢిల్లీలో జరిగిన భారత్-అమెరికా టూ ప్లస్ టూ చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ‘టూ ప్లస్ టూ’ మంత్రివర్గ చర్చల్లో US ప్రతినిధి బృందానికి అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, US డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ నాయకత్వం వహించారు. భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేశారు.
Read Also: Babar Azam Captaincy: నా కెప్టెన్సీ ఉంటుందో పోతుందో: బాబర్ ఆజామ్
భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలలో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అనేక అభివృద్ధి చెందుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ.. మనం ముఖ్యమైన, దీర్ఘకాలిక విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉచిత, స్వతంత్ర, నియమాల ఆధారిత ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని నిర్ధారించడానికి మా భాగస్వామ్యం చాలా ముఖ్యమైనదన్నారు.