Global Hunger Index 2023: గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో భారతదేశ పరిస్థితి మరింత దిగజారింది. 125 దేశాల గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ 111వ స్థానానికి చేరుకుంది. ఇది మాత్రమే కాదు, పిల్లల పోషకాహార లోపం కూడా భారతదేశంలోనే ఉంది.
2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే హైఓల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఎల్లుండి ఈ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తో టీమిండియా.. వన్డే ప్రపంచకప్‌లో వరుసగా ఎనిమిదో విజయం కోసం ఎదురుచూస్తుంది.
Modi-Putin: భారత ప్రధాని నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య త్వరలో భేటీ కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రష్యన్ మీడియాలో విస్తృత కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో ఇరు దేశాధినేతల మధ్య సమావేశం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మాస్కోలోని భారత రాయబారి పవన్ కపూర్ మాట్లాడుతూ..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఎల్లుండి భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ వెళ్తున్నారా? అయితే... జాగ్రత్త. మీరు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ని స్టేడియంలో వీక్షించాలంటే ఐఫోన్ కొన్న దానికంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే. ఈ కారణం చేత విమాన టిక్కెట్లు, హోటళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Palestine: ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదంలో హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై జరిపిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. అయితే స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటుకు తాము మద్దతు ఇస్తున్నట్లు భారతదేశం ప్రకటించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
నిన్న(బుధవారం) ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా అలవోకగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అందులో టీమిండియా స్టార్ బౌలర్ 4 వికెట్లు తీసి ఆఫ్ఘాన్ స్కోరును కట్టడి చేయగా.. ఇక బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే తన బౌలింగ్ లో 4 వికెట్లు సాధించినా.. సంతోషంగా లేనని బుమ్రా చెప్పుకొచ్చాడు. అతను వేసిన 10 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి నలుగురు ఆటగాళ్లను ఔట్…
అహ్మదాబాద్‌లోని ప్రధాని మోడీ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు భారత్‌తో మ్యాచ్ ఆడటం కోసం ఇక్కడకు చేరుకున్నారు. పాకిస్తాన్ జట్టుకు స్వాగతం పలికేందుకు అమ్మాయిలు నృత్యం చేశారు. గుజరాతీ దుస్తులు ధరించిన అమ్మాయిలు పాకిస్థాన్ ఆటగాళ్లకు స్వాగతం పలుకుతూ కనిపించారు. అంతేకాకుండా వారిపై పూలవర్షం కురిపించారు. పాక్ ఆటగాళ్లకు ఘన స్వాగతం పలకడం టీమిండియా అభిమానులకు నచ్చలేదు.
ఇండియా- పాకిస్తాన్ మధ్య 2003 నుంచి మొదలుపెడితే 2019 వరకు జరిగిన వరల్డ్ కప్ లో ఇండియాదే పై చేయి అయింది. అయితే ఇప్పుడు జరిగే మ్యాచ్ కోసం ఇరుజట్లు గెలవాలనే ఆశతో ఉన్నాయి. చూడాలి మరీ 2023 వరల్డ్ కప్ లో ఈ ఇరుజట్ల మధ్య మ్యాచ్ ఎవరు గెలుస్తారో.
వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత్ విజయాల బాటలో పయనిస్తోంది. ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్‌లో చెమటోడ్చి గెలిచిన భారత్.. పసికూన అఫ్గానిస్థాన్ జట్టుపై అలవోకగా విజయం సాధించింది. హిట్ మ్యాన్ రోహిత్ భారీ శతకాన్ని నమోదు చేయడంతో 15 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ అఫ్గానిస్థాన్‌పై తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్‌లో విఫలమైన హిట్ మ్యాన్.. పసికూన అఫ్గాన్‌పై శతకంతో చెలరేగిపోయాడు.