CM Pinarayi Vijayan: భారత్, ఇజ్రాయిల్‌తో సైనిక, రక్షణ ఒప్పందాలను తెంచుకోవాలి.. సీఎం సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Pinarayi Vijayan: కేరళలో పాలక సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా సంఘీభావం ర్యాలీలను చేపడుతున్నాయి. శనివారం కోజికోడ్ వేదికగా అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కేరళ సీఎం పినరయి విజయన్ పాల్గొన్నారు.
ఈ ర్యాలీలో మాట్లాడిన విజయన్.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ ఇజ్రాయిల్‌కి మద్దతు ఇచ్చే విధానాన్ని అవలంభిస్తోందని, బీజేపీ విధానాన్ని ఇండియా స్టాండ్‌గా పరిగణించొద్దని అన్నారు. మా సంఘీభావం పాలస్తీనా అనుకూలంగానే ఉంటుందని అన్నారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మధ్య భారతదేశం పాలస్తీనాకు సంఘీభావంగా నిలిచిందని, ఇజ్రాయిల్‌కి మద్దతు ఇవ్వడం పాలక బీజేపీ విధానంలో భాగమని కేరళ సీఎం పేర్కొన్నారు.
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ భారత్ ను ఆయుధంగా వాడుకుంటోందని, ఇజ్రాయిల్‌తో సైనిక, రక్షణ ఒప్పందాలను భారత్ నిలిపేయాలని సీఎం విజయన్ డిమాండ్ చేశారు. స్వాతంత్య్రానికి పూర్వం, ఆ తరువాత కాలంలో భారత్ పాలస్తీనాకు మద్దతు ఇచ్చిందని, పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో ఇజ్రాయిల్‌ని మనం గుర్తించడం ప్రారంభించామని, అమెరికాతో ఉన్న స్నేహం ప్రభావం చూపిందని వివరించారు. నెహ్రూ కూడా పాలస్తీనా అనుకూల విధానాన్ని కొనసాగించారని గుర్తు చేశారు.
Read Also: Kalidas Jayaram: పెళ్లికి సిద్ధమైన విక్రమ్ నటుడు.. సైలెంటుగా షాకిచ్చాడుగా!
కాంగ్రెస్ పేరు చెప్పకుండా.. దేశంలో బలమైన ప్రభావం ఉందని చెప్పుకునే కొన్ని రాజకీయ పార్టీలు పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొనడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మన దేశంలో చాలా చోట్ల పాలస్తీనా అనుకూల ర్యాలీలను చూశామని, ఎక్కువగా వామపక్షాలే వీటిని నిర్వహించాని, అయితే దేశంలో బలమైన ప్రభావం ఉందని చెప్పుకునే పార్టీ ఎక్కడ ఉంది..? అని ప్రశ్నించారు. కేరళలో మాత్రం వారి వైఖరి వేరేలా ఉంటుందని కాంగ్రెస్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అక్టోబర్ 29న ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపత్యంలో గాజాస్ట్రిప్‌తో మానవతావాద సంధికి పిలుపునిచ్చే తీర్మానంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఓటింగ్‌కి భారత్ గైర్హాజరు కావడాన్ని పినరయి విజయన్ తప్పుపట్టారు. ఇజ్రాయిల్ కి మద్దతు ఇవ్వడం అంటే సొంత భూమి కోసం పోరాడుతున్న పాలస్తీనియన్లకు విధానాన్ని ఉల్లంఘించడమే అని అన్నారు.
తాజావార్తలు
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!