దీపావళి సందర్భంగా దేశంలోని పలు బ్యాంకులకు లాంగ్ వీకెండ్ హాలీడేలు వచ్చాయి. ఏకంగా 6 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. దంతేరస్ దగ్గర నుంచి (10వ తేదీ నుంచి భాయ్ దూజ్ ముగింపు వరకు) ఈ నెల 15 వరకు అనేక ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 11 నుంచి 14 వ తేదీ వరకు చాలా బ్యాంకులు మూతపడి ఉంటాయి. 11వ తేదీ రెండో శనివారం.. 12వ తేదీ ఆదివారం వచ్చింది. దీపావళి పండుగ కారణంగా అనేక నగరాల్లోని బ్యాంకులు ఈ నెల 13, 14న సెలవులు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు 15వ తేదీ కూడా సెలవు దినం ఉంది.
దీపావళి బ్యాంకు సెలవుల లిస్ట్ చూసుకుంటే.. ఎక్కడెక్కడ బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం..
నవంబర్ 10, శుక్రవారం: అగర్తలా, డెహ్రాడూన్, గ్యాంగ్టక్, ఇంఫాల్, కాన్పూర్, లక్నోలోని బ్యాంకులకు సెలవు ఉంది.
నవంబర్ 11, శనివారం: రెండో శనివారం ఎలాగూ అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది
నవంబర్ 12, ఆదివారం: ఆదివారం కూడా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
నవంబర్ 13, సోమవారం: త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్రలోని బ్యాంక్లకు సెలవు ఉంది.
నవంబర్ 14, మంగళవారం: గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, సిక్కింలోని బ్యాంకులకు సెలవు.
నవంబర్ 15, బుధవారం: సిక్కిం, మణిపూర్, ఉత్తర్ ప్రదేశ్, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ లోని బ్యాంకులకు సెలవు ఉంది.
Read Also: Puri Temple: పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట.. ధనత్రయోదశి సందర్భంగా పూజలు
వీటితో పాటు ఈ నెలలో బ్యాంకులకు మొత్తం మీద 15 రోజుల పాటు సెలవు లభించనుంది. వీటిల్లో శని, ఆదివారాలు కూడా ఉన్నాయి. మరోవైపు బ్యాంకులకు సెలవులు ఉన్నా.. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీస్, ఏటీఎం వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. వీటితో బ్యాంకింగ్ సేవలు, మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. అంతేకాకుండా.. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు సెలవుల గురించి ముందే సమాచారం తెలుసుకొని పని దినాల్లో వెళితే ఇబ్బందులు ఉండవు.