Virat Kohli React on Big Six Hits on Haris Rauf Bowling: పరిపూర్ణమైన బ్యాటర్ కావడంపై దృష్టి పెట్టడం కంటే.. కొత్త షాట్లు నేర్చుకోవడం మంచిదని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. బ్యాటింగ్‌కు ఇంకా ఏం చేరిస్తే విజయానికి కృషి చేయచ్చో ఆలోచిస్తే ఆట మెరుగవుతుందన్నాడు. ప్రస్తుతం విరాట్ ప్రపంచకప్ 2023లో బాగా ఆడుతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడి 543 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఆదివారం నెదర్లాండ్స్ జట్టుతో భారత్ చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.
నెదర్లాండ్స్ మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ‘క్రికెట్ ఆటలో టెక్నిక్, నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి నేర్చుకున్న టెక్నిక్ మ్యాచ్‌లు గెలవడానికి ఉపయోగపడడం, లేదా బ్యాటింగ్ మెరుగుపడడం. బ్యాటింగ్‌లో మెరుగుపడడం అనే విషయం గురించి చాలా మందికి అవగాహన ఉండదు. మన బ్యాటింగ్‌కు ఇంకా ఏం చేరిస్తే విజయానికి కృషి చేయచ్చో ఆలోచిస్తే ఆట అదే మెరుగవుతుంది. పరిపూర్ణమైన బ్యాటర్ కావడంపై దృష్టి పెట్టడం కంటే.. కొత్త షాట్లు నేర్చుకోవడం మంచిది. కొత్త షాట్ల వల్ల పరుగులు రావడమే కాకుండా టీమ్ కూడా గెలుస్తుంది’ అని అన్నాడు.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
2022 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో పేసర్ హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో నేరుగా కొట్టిన సిక్సర్‌పై విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో కొట్టిన ఆ సిక్సర్‌ను నేను చాలాసార్లు చూశా. ఎంతో ప్రత్యేకమైన సమయం అది. ఆ షాట్ ఎలా ఆడానో ఈరోజు వరకు నాకే తెలియదు. కానీ చాలా బాగా అనిపిస్తుంది’ అని కోహ్లీ పేర్కొన్నాడు. ఇక శుక్రవారం కోహ్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌ను ఎక్కువగా ఎదుర్కొన్నాడు. 2021 నుంచి లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్లపై విరాట్ సగటు 13 మాత్రమే. ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎక్కువసేపు ప్రాక్టీస్ చేశాడు.