Babar Azam: భారత్‌కు తొలిసారి వచ్చాం.. ఆతిథ్యం అద్భుతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babar Azam Says Indian hospitality is amazing: భారత్‌లో తమకు అపూర్వ స్వాగతం లభించిందని, ఆతిథ్యం అద్భుతంగా ఉందని పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ తెలిపాడు. తొలిసారి భారత్‌కు వచ్చినా.. త్వరగానే పరిస్థితులను అలవాటు చేసుకున్నామన్నాడు. పాక్ జట్టులోని ప్రతి ఒక్కరికి అభిమానుల నుంచి మంచి మద్దతు లభించిందని బాబర్ పేర్కొన్నాడు. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 నుంచి పాక్ నిష్క్రమించింది. లీగ్ స్టేజ్‌లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే సాధించడంతో ఇంటిముఖం పట్టింది.
‘నేను భారత్ నుంచి ఎంతో ప్రేమ పొందా. నేనే కాదు జట్టులోని ప్రతి ఒక్కరికి అభిమానుల నుంచి మద్దతు లభించింది. పాకిస్తాన్ జట్టులోని ప్రతిఒక్కరు భారత్‌కు తొలిసారి వచ్చారు. అయినా త్వరగానే పరిస్థితులను అలవాటు పడ్డాం. సెమీస్ చేరుకోకపోవడం నిరాశ కలిగించే అంశం. మిడిల్ ఓవర్లతో పాటు చివర్లో పరుగులు రాబట్టాల్సింది. బంతి పాత బడిన తర్వాత పరుగులు చేయడం చాలా కష్టమవుతుంది. ఇలాంటి అనుభవాలను ఇక్కడ చవిచూశాం’ అని బాబర్ అజామ్ తెలిపాడు.
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
Also Read: World Cup 2023: భారత్ ఇప్పుడు ప్రపంచకప్ గెలవకపోతే.. మరో 3 సార్లు ఆగాల్సిందే!
‘వన్డే ప్రపంచకప్ 2023ని మేం సరిగ్గా ముగించలేకపోయాం. నిజం చెప్పాలంటే.. వ్యక్తిగతంగా నేను బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. 50 లేదా 100 పరుగులు చేయడమే నా లక్ష్యం కాదు, జట్టును గెలిపించడం ముఖ్యం. నా ప్రదర్శన జట్టు విజయాలకు ఉపయోగపడాలని అనుకుంటా. నేను నెమ్మదిగా ఆడినా, వేగంగా ఆడినా అది జట్టు పరిస్థితులకు అనుగుణంగానే ఉంటుంది. ఎవరైనా జట్టుకు అవసరమైన విధంగా ఆడాల్సి ఉంటుంది’ అని పాక్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!