Ashwin-Jadeja: జడేజా అంటే అసూయ.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- జడేజాతో ఎప్పటికీ పోటీ పడలేను
- జడ్డు అంటే అసూయ
- పంత్ ఫామ్‌పై నమ్మకం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravichandran Ashwin about Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంటే తనకు అసూయ అని, కానీ అతడిని ఎంతో ఆరాధిస్తాను అని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. సహ క్రికెటర్లతో రేసులో ఉన్నప్పుడు వారి కంటే మనమే ముందు ఉండాలని కోరుకోవడం సహజం అని పేర్కొన్నాడు. జడేజాతో తాను ఎప్పటికీ పోటీ పడలేనని తెలిశాక అతడి మీద అభిమానం పెరిందని యాష్ చెప్పాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ అనంతరం ఆర్ అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ… ‘రవీంద్ర జడేజాది స్ఫూర్తిదాయకమైన జీవితం. జడ్డు బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు చాలా సందర్భాల్లో డ్రెస్సింగ్ రూంలో నేను ప్రశాంతంగా ఉండేవాడిని. జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు, బంతితో అయితే బెంబేలెత్తిస్తాడు. ఇక ఫీల్డ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నాకు జడేజా అంటే అసూయ. కానీ నేను జడ్డును ఆరాధిస్తా. నాలుగేళ్ల నుంచి అతడి ఆటతీరుకు అభిమానిని అయ్యాను. గత కొన్నేళ్లుగా బాగా ఆడుతున్నాడు’ అని అన్నాడు.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
‘సహ క్రికెటర్లతో రేసులో ఉన్నప్పుడు.. వారి కంటే మనమే ముందు ఉండాలని కోరుకోవడం సహజం. ఆ తర్వాత ఒకరినొకరు మెచ్చుకుంటారు. మా విషయంలో అదే జరిగింది. రవీంద్ర జడేజాతో నేను ఎప్పటికీ పోటీ పడలేనని తెలిశాక.. అతడి మీద అభిమానంఇంకా పెరిగింది. కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్.. ఏడాదికి పైగా విరామం తర్వాత ఈ టెస్టు సిరీస్‌తో పునరాగమనం చేశాడు. అయినా కూడా అతడి ఫామ్‌పై నాకు నమ్మకం ఉంది. పంత్ అద్భుత సెంచరీ చేశాడు. అతడిపై ఎలాంటి ఒత్తిడి ఉందని నేను అనుకోను. జట్టు మద్దతు ఎప్పుడూ ఉంటుంది’ అని యాష్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!