Jasprit Bumrah Likely To Rested for IND vs BAN 2nd Test: బంగ్లాదేశ్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25లో టీమిండియా తన అగ్ర స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇక సెప్టెంబర్ 27 నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టులోనూ గెలిచి.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు మరింత చేరువకావాలని భావిస్తోంది. అయితే ఈ కీలక టెస్ట్ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడని తెలుస్తోంది.
బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్ నుంచి జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అక్టోబర్‌లో న్యూజీలాండ్, నవంబర్‌లో ఆస్ట్రేలియాతో కీలక టెస్ట్ సిరీస్‌లు ఉన్న నేపథ్యంలో బుమ్రాకు విశ్రాంతిని ఇస్తున్నారట. అంతేకాదు కాన్పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశాలు ఉండడం కూడా అతడిని డ్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయి. బుమ్రాకు రెస్ట్ ఇస్తే.. మొహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ ప్రధాన పేసర్లుగా ఆడనున్నారు.
Also Read: Samsung Fab Grab Fest 2024: శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్ల వర్షం.. 74 శాతం వరకు డిస్కౌంట్!
జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రావచ్చు. ఒకవేళ బ్యాటింగ్ మరింత బలోపేతం కావాలనుకుంటే ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వైపు మొగ్గుచూపొచ్చు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తుది జట్టులో పక్కాగా ఉంటారు. చెన్నై టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 50 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.