Ravichandran Ashwin: ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు: అశ్విన్
- సిరీస్‌ల మధ్య విశ్రాంతి తీసుకోవాలి
- ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు
- విభిన్నంగా ప్రయత్నిస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిరీస్‌ల మధ్య విరామాలు తీసుకోవాలని, అప్పుడే ఫిట్‌గా ఉండొచ్చని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. నైపుణ్యం కంటే శారీరకంగా ఫిట్‌గా ఉంటూ సీజన్‌ను పూర్తి చేయడమే అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. జట్టులో కొనసాగాలంటే నిరంతరం ప్రాక్టీస్‌లోనే ఉండాల్సిన అవసరం లేదని యాష్ పేర్కొన్నాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన యాష్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్న అనంతరం రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ… ‘రానున్న నెలల్లో చాలా టెస్టులు ఆడాల్సి ఉంది. సుదీర్ఘ సీజన్ అనే చెప్పాలి. కఠినమైంది కూడా. కొన్నిసార్లు భవిష్యత్తు తలచుకుంటే కష్టంగా అనిపిస్తుంటుంది. 3-4 నెలల్లో 10 టెస్టులు ఆడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడమే మంచిది. సిరీస్‌ల మధ్య విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే ఫిట్‌గా ఉండొచ్చు. నైపుణ్యం కంటే శారీరకంగా ఫిట్‌గా ఉంటూ సీజన్‌ను పూర్తి చేయడమే నా లక్ష్యం. అందుకే రెండు సిరీస్‌ల మధ్య విరామం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటా’ అని చెప్పాడు.
Also Read
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
Also Read: Rishabh Pant: బంగ్లాదేశ్ ఫీల్డింగ్ సెట్ చేయడానికి కారణం అదే: పంత్
‘కెరీర్ ఆరంభంలో క్రికెట్ ఆడటం వేరు, 38 ఏళ్ల వయసులో ఆడటం వేరు. వయసు పెరుగుతున్నా కొద్దీ రెట్టింపు కృషి చేయాలి. అప్పుడే టెస్టుల్లో ఓపికగా ఆడగలం. అలానే జట్టులో కూడా కొనసాగగలం. అలా అని ఎప్పుడూ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. నేను ప్రాక్టీస్ సెషన్‌లను తగ్గించి.. ఇతర అంశాలలో విభిన్నంగా ప్రయత్నిస్తాను. నేను యోగా చేస్తాను. యోగా ఆటకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది’ అని రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. బంగ్లా సిరీస్ అనంతరం న్యూజీలాండ్, ఆస్ట్రేలియాతో భారత్ టెస్ట్ సిరీస్‌లు ఆడాల్సి ఉంది.
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!