రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం లక్నోలో కొత్త బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగమైన ఈ యూనిట్ భారతదేశ స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలువనుంది. ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ.. నేను లక్నో ఎందుకు రాలేకపోయానో మీ అందరికి తెలుసు.. ఇదే రోజున శాస్త్రవేత్తలు పోఖ్రాన్‌లో అణుపరీక్షలు చేశారు.. 40 నెలల్లోనే ఈ ప్రొడక్షన్…
ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బుక్ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన బుక్ స్టాల్స్‌ను సందర్శించారు. అనంతతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
President Droupadi Murmu: దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం లోక్ మంథన్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. లోక్‌మంథన్ కార్యక్రమాన్ని ద్రౌపది ముర్ము ప్రారంభించారు.
మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా ఉన్నారు. పొదిలి మండలంలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభోత్సవం చేశారు. మండలంలోని కుంచేపల్లి పంచాయితీ పరిధి ఉన్న గురువాయపాలెం నుంచి దాసర్లపల్లి వరకు ఒక కోటి 45 లక్షల రూపాయల సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు.
మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా గడిపారు. పొదిలి మండలంలోని పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి ఆయన శ్రీకారం చుట్టారు.
విశాఖపట్నంలోని కేజీహెచ్ లో ఆధునికీకరించిన కార్డియాలజీ విభాగాన్ని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజినీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ.. ఆంధ్ర మెడికల్ కాలేజ్ 100 యేళ్లు పూర్తి చేసుకుంది..
కుషాయిగూడ పరిధిలో ఉన్న ఆపిల్ బిల్డింగ్ లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనాన్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే నేడు (శనివారం) ప్రారంభించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నూతనంగా నిర్మించిన సామాజిక అరోగ్య కేంద్రాన్ని మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రవిచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సబితక్క మనసు నిండా తెలంగాణ వాదం.. ఉద్యమం సమయంలో హోం మంత్రిగా ఉండి ఎంతో సాయం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని తొందరలోనే ప్రారంభిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రతి రోజు 500 మంది ఇక్కడ అంబేద్కర్ స్మృతివనం పనులు చేస్తున్నారు.. అంబేద్కర్ విగ్రహం ఇంతపెద్దది ఇదే.. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మెగా ప్రాజెక్టు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.