రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం లక్నోలో కొత్త బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగమైన ఈ యూనిట్ భారతదేశ స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలువనుంది. ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ.. నేను లక్నో ఎందుకు రాలేకపోయానో మీ అందరికి తెలుసు.. ఇదే రోజున శాస్త్రవేత్తలు పోఖ్రాన్‌లో అణుపరీక్షలు చేశారు.. 40 నెలల్లోనే ఈ ప్రొడక్షన్ యూనిట్‌ను పూర్తిచేశారు.. ఇంత తక్కువ సమయంలో ఈ యూనిట్ సిద్ధం చేసిన వారికి అభినందనలు తెలిపారు.
Also Read:Ponnam Prabhbakar : కుల గణన మీద అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం
రూ. 300 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ ఉత్పత్తి యూనిట్ ఏటా 80 నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయడానికి రూపొందించారు. భారతదేశ రక్షణ పరిశోధన అండ్ అభివృద్ధి సంస్థ (DRDO), రష్యా NPO మషినోస్ట్రోయేనియా మధ్య జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ బ్రహ్మోస్ క్షిపణి 290 నుంచి 400 కి.మీ. పరిధి కలిగిన, మాక్ 2.8 వేగంతో దూసుకెళ్తుంది.
The BrahMos Aerospace Production Unit in Lucknow is set for inauguration by Raksha Mantri Shri @rajnathsingh (virtually) and Chief Minister Yogi Adityanath today.
The Rs 300 crore facility is a key part of the Uttar Pradesh Defence Industrial Corridor and represents India’s… pic.twitter.com/J4hSuXED0P
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) May 11, 2025