CM KCR: నేటితో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ముగియనున్నాయి. నేడు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. సాయంత్రం ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
వనపర్తి జిల్లా నూతన ఎస్పీ కార్యాలయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్ముద్ ఆలీ ప్రారంభించారు. మహమ్ముద్ ఆలీ వెంట మంత్రి నిరంజన్ రెడ్డి.. డీజీపీ అంజన్ కుమార్ ఉన్నారు.
నాంపల్లి ఏరియా హాస్పిటల్ లో 5 పడకల డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్ ను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వంలో 3 నుంచి 102 కు పెంచాము అని ఆయన వెల్లడించారు.