ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని తొందరలోనే ప్రారంభిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రతి రోజు 500 మంది ఇక్కడ అంబేద్కర్ స్మృతివనం పనులు చేస్తున్నారు.. అంబేద్కర్ విగ్రహం ఇంతపెద్దది ఇదే.. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మెగా ప్రాజెక్టు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ జీవిత విశేషాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం.. ఒక మినీ థియేటర్, అంబేద్కర్ కు సంబంధించిన అన్ని అంశాలు ఉంటాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు
Read Also: Sharwanand: నాని కాదనడంతో శర్వాకి బంపరాఫార్
అంబేడ్కర్ స్మృతివనంలో వెలకట్ట లేని ఎన్నో విశేషాలతో ఈ నిర్మాణం ఉంటుంది అని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. 20 వేల మంది వరకూ వచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం.. కన్వెన్షన్ సెంటర్ ఆలస్యం కావచ్చు.. చరిత్రలో ఇదొక పేజీగా లిఖించుకునేలా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం పూర్తవుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. రాజ్యాంగ దినోత్సవం రోజే పూర్తి చేసుకోవాలని నిర్ణయించామన్నాడు.
Read Also: Sunil : తమిళ్ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ కమెడియన్..
అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణ పనులను ఏపీ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ శ్రీలక్ష్మీ పర్యవేక్షిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. ప్రజలకు అంబేద్కర్ జీవిత విశేషాలు తెలిపేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ స్మృతివనంలో ఒక క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, నవంబర్ 26న సీఎం జగన్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. మిగిలిన పనులన్ని త్వరలోనే పూర్తి చేస్తామని అనుకున్న సమయానికి అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణం పూర్తి అవుతుందని ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.