President Droupadi Murmu: దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం..
- లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు..
- దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం ..
- లోక్ మంథన్ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు ..
- నేటితో ముగిసిన రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Droupadi Murmu: దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం అని లోక్ మంథన్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. లోక్‌మంథన్ కార్యక్రమాన్ని ద్రౌపది ముర్ము ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. 2018 రాంచీలో జరిగిన లోకమంథన్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నానని తెలిపారు. ఆ తర్వాత ఇవాళ మరోసారి లోకమంథన్ లో పాల్గొనే అవకాశం కలిగిందన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం ఇది అన్నారు. భారతదేశ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, మన పరంపర చాలా ఘనమైనవి అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం గురించి మాట్లాడతాం.. పాటిస్తాం అన్నారు. ఇదే మన బలం, ఇదే మన స్థైర్యం అని తెలిపారు. ఇన్ని భిన్న సంస్కృతులు ఒకేచోట ఉండటం నిజంగా చాలా గొప్ప విషయం అన్నారు. ఇవన్నీ కలిసిన సుందరమైన ఇంద్రధనస్సు లాంటి దేశం మనదన్నారు. వనవాసి, నగరవాసి అని తేడా లేకుండా మనమంతా భారతవాసులం అనే విషయాన్ని మరవొద్దన్నారు.
Read also: Adilabad: మహారాష్ట్రకు మగ పులి.. మరి ఆడ పులి ఎక్కడ?
Also Read
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
లోకమంథన్ కార్యక్రమంలో.. అహల్యాబాయ్ హోల్కర్, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరాంగనల పై ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని తెలిసి హర్షం వ్యక్తం చేశారు. వారి ప్రేరణ ఎప్పటికీ మనకు అవసరం అన్నారు. విదేశాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తుండటం అభినందనీయం అన్నారు. ఇండోనేషియా సహా వివిధ దేశాల ప్రతినిధులు ఈ వేదిక ద్వారా తమ సంస్కృతిని ప్రదర్శిస్తుండటాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని తెలిపారు. భారతదేశ ఆధ్యాత్మిక భావనలు, కళలు, సంగీతలు, విద్య, వైద్య విధానాలు ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పొందాయన్నారు. ప్రపంచానికి మనం జ్ఞాన దర్శనం చేశామన్నారు. ప్రపంచమంతా ప్రస్తుత సమయంలో మళ్లీ భారతదేశ జ్ఞానాన్ని పంచాల్సిన అవసరం ఏర్పడింది. విదేశీ శక్తులు శతాబ్దాలుగా మన మీద జులూం ప్రదర్శించాయి. మన సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను విధ్వంసం చేశాయి. మనలో ఐకమత్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని తెలిపారు. మనలో బానిస మూలాలను చొప్పించారన్నారు.
Read also: TG High Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు..
కానీ మన దేశ ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ.. వీటిని నిరంతరం జీవింపజేశారన్నారు. ఇకపైనా వీటిని కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారతదేశం బానిసత్వ మూలాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజ్ పథ్ పేరు కర్తవ్యపథ్ మారిందన్నారు. దర్బార్ హాల్ పేరు.. గణతంత్ర మండప్ గా మార్చామన్నారు. ఇది బానిసత్వ ఆలోచనలను తొలగించే దిశగా జరుగుతున్న ప్రయత్నం అన్నారు. మన ఆలోచనలు కూడా మారాలని తెలిపారు. ఇటీవల.. ఓ హైకోర్టులో మహిళా జడ్జి విగ్రహాన్ని ప్రారంభించారన్నారు. కానీ ఆ విగ్రహం కళ్లకు నల్లని గంతల కట్టలేదని, ఇది మనం సాధిస్తున్న మార్పుకు సంకేతం అన్నారు. మన ఆలోచనలు కూడా మారాలని తెలిపారు. అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలమన్నారు. ఐకమత్యం, సమరసతే మన సభ్యత.. మన భవిష్యత్తు అన్నారు. ఈ దిశగా మనమంతా కలిసి పనిచేద్దామన్నారు. లోక్ మంథన్ కార్యక్రమం అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుగు ప్రయాణం అయ్యారు. నేటితో రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన ముగింది.
Bhupalpally: హనుమాన్ విగ్రహానికి మంటలు.. స్థానికుల్లో ఆందోళన..
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్‌ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!