రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నూతనంగా నిర్మించిన సామాజిక అరోగ్య కేంద్రాన్ని మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రవిచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సబితక్క మనసు నిండా తెలంగాణ వాదం.. ఉద్యమం సమయంలో హోం మంత్రిగా ఉండి ఎంతో సాయం చేశారు. క్యాబినెట్ లో అందరికంటే సీనియర్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో నాడు 17వేల పడకలు ఉంటే.. 50 వేల పడకలు ఏర్పాటు చేయబోతున్నాం.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య రంగం ఎంతో అభివృద్ధి చెందింది అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Kejriwal: గత తొమ్మిదేళ్లుగా మౌనంగానే ఉన్నారు.. ప్రధానిపై కేజ్రీవాల్ ఆగ్రహం
నాటి పాలకులు వైద్యాన్ని గాలికి వదిలేశారు.. పేదలకు విద్య, వైద్యం అందాలనేది మా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీనీ నిజాం, గాంధీని అక్కడి వ్యాపారులు, కాకతీయ మెడికల్ కాలేజీనీ రైతులందరు కలిసి ఏర్పాటు చేసుకున్నారని హరీశ్ రావు పేర్కొన్నాడు. అంతే తప్ప ఒక్క మెడికల్ కాలేజీ కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అనుకున్నారు. అందులో భాగంగానే మహేశ్వరంకు కూడా మెడికల్ కాలేజీ మంజూరు చేశారని వైద్యారోగ్యశాఖ మంత్రి తెలిపారు.
Read Also: Jailer: వర్మ ప్లే లిస్ట్ లో డ్యాన్స్ చేసిన వ్యక్తి చనిపోయాడని మీకు తెలుసా.. ?
550 పడకల ఆసుపత్రి మీకు అందుబాటులోకి వస్తుంది.. త్వరలో మెడికల్ కాలేజీ పనులు ప్రారంభం చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. మొదలు ఢిల్లీలో టికెట్ల కోసం కొందరు కొట్లాట చేస్తారు.. ఇక్కడికి వచ్చి ప్రజల్ని మభ్య పెట్టే మాటలు చెబుతారు.. ఎన్నికలపుడు మాత్రమే వచ్చే వాళ్ళు కాదు, ఎప్పుడు ప్రజల మధ్య ఉండే సబిత లాంటి నాయకులు గెలవాలన్నాడు. నాగిరెడ్డి పేటలో ఐటీ టవర్ ఏర్పాటు విషయాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హరీశ్ రావు అన్నాడు.
Read Also: Bandaru Vijayalakshmi: పార్టీల చూపు బండారు విజయలక్ష్మి వైపు ..!?
మన మిషన్ కాకతీయను కేంద్రం కాపీ కొట్టి అమృత్ సరోవర్ గా మార్చుకుంది అని మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతు బందును కిసాన్ సమ్మాన్ యోజన అని అమలు చేస్తున్నారు.. జిల్లాకో మెడికల్ కాలేజీ అని సీఎం అంటే, ప్రధాని కూడా అన్ని జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు.. మన మిషన్ భగీరథను హర్ ఘర్ జల్ అని అమలు చేస్తున్నారు.. తెలంగాణ ఆచరిస్తే, నేడు దేశం అనుసరిస్తున్నది అని మంత్రి పేర్కొన్నారు. నాడు చంద్రబాబు వ్యవసాయం దండగ అంటే, నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడు.. మూడు గంటలు కావాలంటే కాంగ్రెస్ కి ఓటు వేయాలి.. 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి వేయాలని తెలిపారు.
Read Also: Santosh Sobhan : అమ్మో విసిగిపోయా.. పెళ్లి పై సంతోష్ శోభన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 35 వేల కోట్ల రూపాయలను ఆపింది అని మంత్రి హరీశ్ రావు అన్నారు. దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు.. కిషన్ రెడ్డి ఇక్కడ ఊరు దత్తత తీసుకొని పది కోట్లు కాదు, పది రూపాయలు కూడా ఇవ్వలేదు.. మీటర్లు పెట్టాలని మేము చెప్పలేదు అని అంటున్న కిషన్ రెడ్డి, మరి ఎందుకు 35 వేల కోట్లు ఇవ్వడం లేదో ఆర్థిక మంత్రిగా అడుగుతున్నా సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఉచిత కరెంట్ మీద 60 వేల కోట్లు, 72 వేల కోట్లు రైతు బంధు కోసం, 5500 కోట్లు రైతు బీమా కోసం, 36 వేల కోట్లు రుణ మాఫీ కోసం ఇచ్చాము.. లక్ష లోపు ఉన్న రుణాలు మాఫీ చేశాం.. తండాలు పంచాయతీ చేసింది కేసీఆర్.. ఎస్సీ, ఎస్టీలకు గురుకులాలు ప్రారంభించారని అన్నాడు.