Miss World 2025 : ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న క్రమంలో.. అలాగే దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ట్రైడెంట్ హోటల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఈ హోటల్లోనే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న అందమైన కంటెస్టెంట్లు బస చేస్తున్నారు. ట్రైడెంట్ హోటల్ భద్రతా బాధ్యతలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హోటల్లో ఆక్టోపస్ టీమ్‌తో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సైబరాబాద్ పోలీసులు హోటల్లో పకడ్బందీగా భద్రతను ఏర్పాటు…
CM Revanth Reddy: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై భారత సైన్యం మెరుపుదాడులు కొనసాగుతున్న తరుణంలో, హైదరాబాద్ వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సహా ఇతర కీలక విభాగాల ఉన్నతాధికారులు హాజరవుతారు. తాజా పరిస్థితులను…
మేడ్చల్ జిల్లా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం... తెలంగాణలోనే అత్యంత ఖరీదైన సెగ్మెంట్. ఐటీ సెక్టార్ విస్తరించిన ఏరియా. అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం. అలాంటి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమైంది.
పౌర రక్షణ బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర పరిపాలన శత్రు దాడిలో ప్రాణ, ఆస్తినష్టం తగ్గించేందుకు ప్రజలను సిద్ధం చేస్తోంది. పౌర రక్షణ చట్టం 1968 ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పుడూ పౌర రక్షణ నిర్వహిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో స్పందించేందుకు సివిల్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంటాయి. పౌరులకు అవగాహన కల్పించి శిక్షణ ఇస్తాయి. పౌరుల ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు పని చేస్తాయి. శత్రు దాడి సమయంలో ప్రజల ధైర్యాన్ని పెంచేందుకు తోడ్పడతాయి. ఈ మేరకు…
Viral Video: భారతీయులలో ముఖ్యంగా మధ్య తరగతి వినియోగదారులకు ఆఫర్, డిస్కౌంట్, ఫ్రీ వంటి మాటలు వినిపిస్తే చాలు.. అది ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్లిపోతుంటారు ప్రజలు. నిజానికి కొందరైతే ఆ వస్తువు అవసరం ఉన్నా లేకున్నా ఆఫర్ అంటే ఓ మోజు. ఈ మధ్య కాలంలో చిన్నా, పెద్ద కంపెనీలు అలాగే వ్యాపారస్తులు తమ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టి మార్కెట్‌ని ఆకట్టుకుంటున్నారు. ఇది వ్యాపార వృద్ధికి దోహదం చేస్తుంది. ఇకపోతే, తాజాగా హైదరాబాద్ దిల్…
విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయ్యింది.. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బాత్రూమ్లో జారిపడటంతో కూడి చేయి విరిగినట్టుగా తెలుస్తోంది.. దీంతో.. లండన్‌లో ప్రాథమిక వైద్యం తీసుకున్న ఆయన్ను మెరుగైన వైద్య సేవల కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించారు..
బిగ్ బాస్, అందాల పోటీలతో స్త్రీ జాతికి కళంకం తెస్తాయి.. బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయాలి.. అందాల పోటీలను రద్దు చేయాలన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బిగ్ బాస్ కు మొదటి నుంచి మేము వ్యతిరేకం.. సమాజానికి ఉపయోగపడని షో బిగ్ బాస్ అన్నారు.. మంచి వయసులో ఉన్న యువతి యువకులను తీసుకెళ్లి బిగ్ బాస్ లో పడేస్తే.. ప్రకృతి రీ యాక్షన్స్ కు లోనవుతారన్న ఆయన.. అదే సమయంలో తప్పు…
మినిస్టర్ క్వార్టర్స్ లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు. ఆర్టీసీ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి పొన్నం ఆర్టీసీ సమస్యలపై ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా ఈరోజు, రేపు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని తెలిపారు. ఆర్టీసీ సమస్యలు వినడానికి నేను కానీ మా ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు.…
డబ్బు సంపాదనే లక్ష్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా హైదరాబాద్ లో ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. జూబ్లీహిల్స్ లో బూమ్ బూమ్ పేరిట కస్టమర్లకు వల వేస్తు వ్యభిచారానికి పాల్పడుతున్నారు. థాయిలాండ్ యువతితో పాటు బంగ్లాదేశ్ యువతి చేత వ్యభిచారం చేయిస్తున్నారు. సర్వీస్ అపార్ట్ మెంట్ కేంద్రంగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారు. థాయ్ లాండ్, బంగ్లాదేశ్ నుంచి యువతులను రప్పించి దందా చేస్తున్నారు. నాయక్ అనే నిర్వాహకుడు ఈ దందాకు తెరలేపాడు.…
ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ జట్లు ముఖాముఖిగా 25 సార్లు పోటీ పడ్డాయి. 13 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించగా.. మరో 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది.