Gulzar House : హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం నగరాన్ని షేక్ చేసింది. శ్రీకృష్ణ పెరల్స్ పేరిట పలు సంవత్సరాలుగా ఆభరణాల వ్యాపారం చేస్తున్న గోవింద్ మోడీ, సునీల్ మోడీ, పంకజ్ మోడీలకు చెందిన ఈ షాపులో మే 18 వ తేదీన అర్థరాత్రి తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది అమూల్యమైన ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం ఘటనపై వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది. నేడు ప్రత్యేక దర్యాప్తు బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించనుంది.
Manchu Manoj : శివయ్యా అంటే శివుడు రాడు.. అన్నకు మనోజ్ కౌంటర్..
ప్రమాదానికి గల ప్రధాన కారణంగా భవన యజమాని నిర్లక్ష్యమే పేర్కొనబడింది. ఫస్ట్ ఫ్లోర్‌లో నిరంతరంగా నడుస్తున్న ఏసీ కంప్రెషర్ అధిక వేడి ఏర్పడటంతో షార్ట్ సర్క్యూట్‌కు దారి తీసింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో మంటలు విస్తరించి, భారీగా వ్యాపించాయి. భవన నిర్మాణంలో అగ్ని నివారణ చర్యలు లేకపోవడం, పైకప్పులో ఉన్న డెకోలం రూఫింగ్ మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమయ్యింది. అంతేకాక, భవన ప్రవేశద్వారం , అంతస్తులకు వెళ్లే మార్గాలు చాలా ఇరుకుగా ఉండటంతో అక్కడ ఉన్నవారు బయటకు రావలేకపోయారు. ఈ కారణంగా మృతుల సంఖ్య పెరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
విద్యుత్ సరఫరాలో తరచూ సమస్యలు ఏర్పడుతున్నాయని, దీనిపై యజమానిని ఎన్నోసార్లు సమాచారం ఇచ్చినా, తగిన చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. ఇప్పుడు పోలీసులు ప్రమాదానికి కారణమైన భవనాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అధికారులు ఈ దుర్ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన మరోసారి నగరంలోని పాత భవనాల భద్రతా పరిస్థితులపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
Cyclone: అరేబియా సముద్రంలో తుఫాన్.. దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన