Fire Accident : పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి.. మృతుల్లో ఓ చిన్నారి..?
- మీర్‌చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం
- ఓ భవనంలో ఎగిసిపడుతున్న మంటలు
- ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident : హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు భవనాన్ని చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న కొందరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు తగిలినట్లు తెలుస్తోంది. వారికి అక్కడే ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.
Chennai: సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్ల కలకలం.. స్నేహితుడైన ఓ ఖైదీ కోసం గంజాయి ఇవ్వడానికి వెళ్ళి..
Also Read
అయితే.. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని సమాచారం.. అంతేకాకుండా… మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో తీరని శోకం నెలకొంది. మృతి చెందిన మిగిలిన వారి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవనంలో సరైన భద్రతా చర్యలు లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు ఇప్పటివరకు 13 మందిని సురక్షితంగా వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, వెంటనే ఘటనా స్థలానికి 10 అంబులెన్స్‌లను రప్పించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దాదాపు 30 మంది వరకు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో మొత్తం నాలుగు కుటుంబాలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
USA: కాలిఫోర్నియాలోని ఆసుపత్రి సమీపంలో బాంబు పేలుడు.. ఒకరు మృతి
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!