HYDRA : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లోని ఆక్రమిత నిర్మాణాలను తొలగిస్తూ చర్యలు చేపట్టారు. మొదటగా కూకట్‌పల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ పరిధిలోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్‌లోని అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు ధర్మయుద్ధం ప్రారంభించారు. సర్వే నంబర్ 145లో ఉన్న 9 ఎకరాల లేఅవుట్‌ను అన్‌రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఆధారంగా ఆక్రమించారని, స్థానికులు ఆరోపించారు. ఈ ప్రాంతంలో మొత్తం 79 ప్లాట్లు, వాటికి సంబంధించిన పార్కులు, రహదారులు కబ్జాకు గురైనట్లు ప్లాట్ యజమానులు ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేశారు.
ఈ ప్లాట్లు 2000లో మధ్యతరగతి కుటుంబాలకు అమ్ముడైపోయినవే. అయితే ఆ స్థలంపై శివ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి హక్కు చూపిస్తూ అక్రమంగా కబ్జా చేశారని, దీనికి సంబంధించి 2024లో హైకోర్టు బాధితుల అనుకూలంగా తీర్పునిచ్చినా చర్యలు లేకపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక, ఆ స్థలాన్ని దశాబ్దాలుగా ఇతరులకు అద్దెకు ఇచ్చి నెలకు రూ.50 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నాడంటూ ప్లాట్ యజమానులు ఆరోపించారు.
Shashi Tharoor: కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన శశిథరూర్! వేటుపై తర్జనభర్జనలు
ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ. రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. గత బుధవారం ఆయన సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పరిశీలనలో హెచ్ఎండీఏ లేఅవుట్‌లో పార్కులు, రహదారులు ఆక్రమించబడ్డట్లు తేలింది. వెంటనే బుల్డోజర్ల సహాయంతో సోమవారం ఉదయం పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణాలను కూల్చివేశారు.
ఇక మరోవైపు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలోని డాలర్ హిల్స్ లేఅవుట్‌లో కూడా హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు చేపట్టారు. అక్కడ రోడ్లు, పార్కులు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు ఆరోపణలు రావడంతో కమిషనర్ రంగనాథ్ బుధవారం అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.
ఇటీవలి కాలంలో పాత లేఅవుట్‌ను రద్దు చేసి వ్యవసాయ భూమిగా మార్చి ఎన్‌సీసీ సంస్థకు అప్పగించినట్లు సమాచారం. విచారణ సందర్భంగా ఇరుపక్షాల నుంచి వివరాలు సేకరించిన హైడ్రా, పార్క్ స్థలం, రహదారులు అక్రమంగా ఆక్రమించబడ్డాయని నిర్ధారించింది. ఇక అక్కడ అనుమతుల్లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నట్లు స్పష్టమైన నేపథ్యంలో, తాత్కాలికంగా పనులను నిలిపివేసి, నిర్మాణాలను కూల్చివేసింది.
Viral News : పుటాణీ హీరోలు.. మానవత్వాన్ని కదిలించిన ఇద్దరు చిన్నారుల కథ..!