Fire Accident: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సమయంలోనే రాజేంద్రనగర్‌లోని మైలర్‌దేవ్ పల్లిలో మరొక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.. ఇక్కడ చాలా తెలివిగా వ్యవహరించి టెర్రస్ పైకి వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నారు.. ఇక్కడ కూడా ఫైర్ సిబ్బంది సకాలంలో అక్కడికి వెళ్లి 20 మంది పిల్లలతో పాటు 31 మంది పెద్దలను రక్షించారు.. పాతబస్తీ గుల్జార్ హౌజ్ 17 మంది ప్రాణాలు పోతే అక్కడ 24 మందిని అధికారులు కాపాడారు.. మైలర్‌దేవ్ పల్లిలో ఏకంగా 53 మందిని అధికారులు రక్షించారు.. పాతబస్తీ మైలర్ దేవ్ పల్లి రెండు సంఘటనలో ఒకటే తేడా.. పాతబస్తీలో టెర్రస్ మీద ఉన్న ఇనుప గ్రిల్ కు తాళాలు వేయడంతో ప్రాణాలు రక్షించుకోలేక వాళ్లు చనిపోయారు.. మైలార్ దేవ్ పల్లిలో మాత్రం టెర్రస్ మీద ఉన్న ఇనుప గ్రిల్‌కు తాళం వేయకుండా వదిలి వేయడంతో వాళ్లంతా పైకి వెళ్లి ప్రాణాలను రక్షించుకున్నారు.. రెండింటి దగ్గర కూడా శాపంగా మారితే మరొకరికి వరంగా మారాయి.. ఇప్పుడు ఈ రెండు సంఘటనల మీద కొంత ఆసక్తి నెలకొంది..
మైలర్ దేవ్ పల్లి లోని ఒక ఇంటిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులకు సమాచారం వచ్చింది.. దీంతో సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది బయలుదేరారు.. ఈ భవనం నీకు కూడా ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించిన మెట్ల మార్గం ఒకటే ఉంది.. అంతేకాకుండా ఎవరు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.. చిన్న మెట్ల మార్గం ఉండడం తోటి ఎవరు బయటికి రాలేక అందరు ఇబ్బంది పడ్డారు.. ముఖ్యంగా 20 మందికి పైగా పిల్లలు ఆ ఇంటిలో చిక్కుకొని పోయారు.. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునేసరికి అక్కడ అందులో ఉన్నవాళ్లకు ఏం చేయాలో పాలు పోలేదు.. దీంతో ఫైర్ సిబ్బంది వెంటనే మైకుల ద్వారా బిల్డింగ్ పైకి వెళ్ళిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు.. దీంతో ఆ భవనం పైన ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే టెర్రస్ మీదికి చేరుకున్నారు.. ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మంటలను అరగంట పాటు శ్రమించి అధికారులు కంట్రోల్ లోకి తీసుకొని వచ్చారు.. అటు తర్వాత పక్క భవనం నుంచి నిచ్చెన్నదార అధికారులు కిందికి దిగి 53 మందిని రక్షించారు.. ఇందులో చిన్నపిల్లల్ని తమ భుజాల మీద ఎత్తుకొని ఫైర్ సిబ్బంది కిందికి తీసుకొని వచ్చారు.. 20 మంది చిన్నపిల్లల్ని ఈ ఇంటి నుంచి ఫైర్ సిబ్బంది రక్షించారు.. మిగతా వాళ్ళని నిచ్చెనల ద్వారా కిందికి దించి వేశారు.. అయితే మంటలు అంటుకోవడంతోనే వాళ్లంతా ఆర్తనాదాలు చేస్తూ రక్షించమని అరిచారు.. ఫైర్ సిబ్బంది రెండు నిమిషాల్లో అక్కడికి చేరుకొని ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ సూచనలు చేసి టెర్రస్ పైకి వెళ్ళే విధంగా చేశారు.. అదే సమయంలో నిచ్చెనన్న ధార ఫైర్ సిబ్బంది పైకి వెళ్లి పైన ఉన్న వాళ్ళందరినీ ఇంటికి దించేశారు.. మొత్తంగా 20 మంది చిన్నారులతో పాటు 33 మంది పెద్దలను ఫైర్ సిబ్బంది రక్షించారు..