Fire Accident : మీర్ చౌక్ భారీ అగ్నిప్రమాదంలో 11కి చేరిన మృతుల సంఖ్య
- మీచ్‌చౌక్‌లో భారీ అగ్నిప్రమాదంలో 11కి చేరిన మృతుల సంఖ్య
- ఘటనా స్థలానికి వచ్చి బాధిత కుటుంబంతో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- మృతుల్లో ముగ్గురు చిన్నారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident : నగరంలోని మీర్‌చౌక్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. మీర్‌చౌక్ ప్రాంతంలోని ఓ నివాస భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు 10 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇంటి నిర్మాణం తేడాగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఊపిరాడక 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 14 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా, వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటన సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఫైర్ సిబ్బందికి ఆక్సిజన్ సిలిండర్లు లేకపోవడంతో ప్రాణహానికీ కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. రెస్క్యూలో ఆలస్యం జరగడం తీవ్రతను పెంచిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు పూర్తి సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు.
Also Read
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
మృతుల వివరాలు ఇలా ఉన్నాయి
అభిషేక్ మోడీ (30)
ఆరుషి జైన్ (17)
హర్షాలి గుప్తా (7)
షీతల్ జైన్ (37)
రాజేందర్ కుమార్ (67)
సుమిత్ర (65)
మున్నిబాయి (72)
ఇరాజ్ (2)
ఇంకా ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది.
అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భవనంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియనున్నాయి.
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!