పెంపుడు కుక్క కరవడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణాజిల్లా ప్రాంతానికి చెందిన డి.పవన్‌కుమార్ (37) తన స్నేహితుడు సందీప్ తో కలిసి గత ఐదేళ్ళుగా హైదరాబాద్ మధురానగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పవన్‌కుమార్ ప్రైవేటుసంస్థలో క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యం కారణంగా వెళ్ళడం లేదు. ప్రతిరోజు ఆసుపత్రికి స్నేహితునితో కలిసి వెళ్ళి వస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా…
హైదరాబాద్‌లోని ప్రణామ్ ఆసుపత్రి ఓ రోగి ప్రాణాలను కాపాడింది. ప్రణామ్ హాస్పిటల్స్ కి చెందిన సర్జికల్ బృందం ఒక రోగి కడుపులో నుంచి 8.5 కిలోల భారీ అండాశయ కణితిని తొలగించింది. అధునాతన వైద్య పరికరాలు, పలు విభాగాల్లో నైపుణ్యం కలిగిన ఈ ఆస్పత్రి బృందం కణితిని విజయవంతంగా తొలగించి మరో మైలురాయిని సాధించింది. ఈ వ్యాధి బారిగన పడిన రోగి మధ్య వయస్కురాలు. ఆమె కొన్ని నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పి, వాపుతో బాధపడుతున్నారు. రోగిని…
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మృతి చెందిన దంపతులు కనకయ్య,రాజమ్మ గా పోలీసులు గుర్తించారు. కనకయ్య వాచ్మెన్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. మృతులు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఒంటిపై గాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా భావిస్తున్నారు. Also Read:SridharBabu : దిల్ రాజు ‘లోర్వెన్…
గోకులం సిగ్నేచర్ జువెల్స్ హైదరాబాద్ లో కొత్త షోరూమ్ ను ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. తన సెకండ్ అవుట్ లెట్ ని కేపీహెచ్ బీలో గ్రాండ్ గా ఓపెన్ చేయనున్నట్లు ప్రకటించింది. రేపు అనగా మే 04న ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వాసవి శ్రీ శ్రీ సిగ్నేచర్స్ కేపీహెచ్ బీ 5th ఫేజ్, అపోజిట్ నెక్సస్ మాల్ కూకట్ పల్లిలో ప్రారంభం కానుంది. ప్రముఖ సినీ తార కాజల్ అగర్వాల్ చేతుల…
హైదరాబాద్ అంబర్పేట్ ఫ్లై ఓవర్‌ను సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అంబర్పేట్ ఫ్లై ఓవర్ పనులను కిషన్‌రెడ్డి పరిశీలించారు.
కామాంధులు, పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కఠిన చట్టాలు అమలవుతున్నప్పటికీ మహిళలు, యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగుచూసింది. బరితెగించిన కామాంధులు భర్త కళ్లెదుటే భార్యను వేధించారు. అసభ్యకర మాటలతో రెచ్చిపోయారు. నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో ఆకతాయిలు బెదిరింపులకు పాల్పడ్డారు. Also Read:Virat Kohli: అన్ని ఆలోచించాకే రిటైర్మెంట్ ప్రకటించా.. కోహ్లీ…
Hyderabad Metro: హైదరాబాద్ నగరంలోని మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ టు ఎల్బీ నగర్ మార్గంలో మెట్రో ట్రైన్ ఆగిపోయింది. దాదాపుగా 20 నిమిషాల పాటు భరత్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర రైలు నిలిచిపోయింది.
Gold Smuggling: హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. మస్కట్ నుంచి వచ్చిన విమాన సిబ్బంది వద్ద బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలో బీజేపీ వ్యవహారాల మీద ఆ పార్టీ ఢిల్లీ నాయకత్వం ఇక సీరియస్‌గా ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే... రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సర్ ఇక్కడి నేతలకు గట్టిగా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సంస్థాగత ఎన్నికల సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా సంఘటన సంరచన ఇన్ఛార్జ్లు హాజరయ్యారు.
FDI Cyber Lab: హైదరాబాద్ నగరంలో డిజిటల్ ఫోరెన్సిక్స్, డేటా రికవరీ రంగాల్లో కీలక ముందడుగుగా FDI ల్యాబ్స్ నాంపల్లిలో తన తొలి అత్యాధునిక సైబర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఇండియన్ ఆఫీస్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేక విభాగంగా పని చేసే ఈ ల్యాబ్, డిజిటల్ భద్రతా అవసరాల పరిష్కారానికి కీలక కేంద్రంగా మారనుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఆధునిక సైబర్ ల్యాబ్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ.. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు డేటా…