Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు బిగ్ అలర్ట్ జారీ చేశారు. నేడు, రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ వాతావరణ పరిస్థితులు రాష్ట్రాల్లోని పలు జిల్లాలను ప్రభావితం చేయనున్నాయని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పారు.
Read Also: Subham: సమంతకు ఓటీటీ షాక్?
అయితే, ఏపీలోని అనకాపల్లి, అన్నమయ్య, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, శ్రీ సత్యసాయి, ఏలూరు, తూర్పు గోదావరి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అలాగే, రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. రైతులు పంటలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.
Read Also: Karali : ‘కరాలి’ మొదలెట్టిన నవీన్ చంద్ర
ఇక, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, మహబూబాబాద్ లాంటి పలు జిల్లాల్లో భారీ వర్షాలు, గంటకు 30-50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం లేదా రాత్రి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మల్కాజ్‌గిరి, తార్నాక, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్ లాంటి ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములు సంభవించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచించారు.
Read Also: PSLV-C61: ఇస్రో రాకెట్ వైఫల్యానికి కారణం ఇదేనా..?
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజుల పాటు కొనసాగే ఛాన్స్ ఉందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.