హైదరాబాద్ లో రోజుల వ్యవధిలోనే ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల పాత బస్తీలోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా అందులోని నివాసితులు ప్రాణాలతో బయటపడ్డారు. నేడు మీర్ చౌక్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అగ్నిప్రమాదంలో పలువురు దుర్మరణం పాలవడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Also Read:S*xual Assault: ఐదేళ్ల మేనకోడలిపై మైనర్ మామ అత్యాచారం.. చివరకు.?
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాద ఘటనపై స్పందించారు. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ దుర్ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదన చెందాను. బాధిత కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. క్షతగాత్రులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నాను అని తెలిపారు.
Also Read:UP: పెళ్లైన ఆరు రోజులకే ఘోరం.. అందుకు ఒప్పుకోలేదని..
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అగ్నిప్రమాద ఘటనపై స్పందిస్తూ.. హైదరాబాద్ లోని చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు దుర్మరణం పాలవడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భవనం మొదటి అంతస్తులో చెలరేగిన మంటల్లో చిన్నారులు, మహిళలు సహా పలువురు మరణించడం విషాదకరం. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని తెలిపారు.