Cyber Fraud : సీఎం ఓఎస్డీ పేరుతో సైబర్ వల.. వ్యాపారులకు ఉచ్చు..!
- చీఫ్ మినిస్టర్ ఓఎస్డీ అంటూ వ్యాపారులకు వల
- సైబర్ నేరగాళ్ల మీద కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
- సీఎం ఆఫీసు పేరుతో వ్యాపార సంస్థళ యజమానులకు ఈ మెయిల్స్, వాట్సాప్ మెసేజ్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud : హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. చీఫ్ మినిస్టర్ ఓఎస్‌డీ (ప్రత్యేక అధికారి) పేరుతో వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా వల విసురుతున్నారు. ఈ నేరాలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయబడింది. సీఎం కార్యాలయం పేరుతో వ్యాపార సంస్థల యజమానులకు ఈమెయిల్స్ , వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయని, వాటి ద్వారా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు సీఎం ఓఎస్‌డీ పేరును వాడుకుని, వివిధ వ్యాపార సంస్థల యజమానులను సంప్రదిస్తున్నారు. ప్రభుత్వ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు ఇప్పిస్తామని, లేదా ఇతరత్రా సహాయం చేస్తామని నమ్మబలుకుతూ, వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు.
Mahendran : మణిశర్మ చేతుల మీదుగా ‘వసుదేవ సుతం’ గ్లింప్స్ రిలీజ్..
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఈ మోసపూరిత వ్యవహారంపై అజిత్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, ఈమెయిల్స్ , వాట్సాప్ మెసేజ్‌లను పంపిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేరగాళ్ల వెనుక పెద్ద ముఠానే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వ్యాపార సంస్థల యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సీఎం కార్యాలయం పేరుతో వచ్చే అనుమానాస్పద ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్‌లకు స్పందించవద్దని సూచిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి మోసపూరిత ప్రయత్నాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కార్యాలయం పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు తెలిపారు.
Pavankalyan : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ కోసం న్యూ ప్లాన్ ..!
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!