HCU Lands Issue: హైదరాబాద్ నగరంలోని కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లలో విచారణకు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ హాజరయ్యారు. ఈసందర్భంగా హెచ్సీయూ భూముల విషయంలో తప్పుడు పోస్టులు పోస్ట్ చెయ్యడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.
Crime: హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. రిలయన్స్ డిజిటల్ షో రూమ్ దగ్గర రక్తం మడుగులో పడి ఉన్న మృతదేహం లభ్యమైంది. అయితే, హయత్ నగర్ లోని ముద్దిరాజ్ కాలనీకి చెందిన నగేష్ గా గుర్తించారు.
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి ఉరి శిక్ష సరైనదేనని సంచలన తీర్పునిచ్చింది. నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2013లో దిల్సుఖ్నగర్లో పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై NTV తో దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల బాధిత కుటుంబాలు తమ ఆవేదనను పంచుకున్నాయి. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనపై హైకోర్టు ఇచిన తీర్పుపై మేము హర్షం…
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి ఉరి శిక్ష సరైనదేనని సంచలన తీర్పునిచ్చింది. 2013లో దిల్సుఖ్నగర్లో పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో 18 మంది మృతి, 130 మందికి గాయాలు అయ్యాయి. ఈ విషాద ఘటన నగర ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. 2016లో NIA ఫాస్ట్ట్రాక్కోర్టు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఉరిశిక్ష విధించింది.…
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. 2013లో దిల్సుఖ్నగర్లో పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో 18 మంది మృతి, 130 మందికి గాయాలు అయ్యాయి. ఈ విషాద ఘటన నగర ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. 2016లో NIA ఫాస్ట్ట్రాక్కోర్టు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. అయితే కింది కోర్టు తీర్పుపై ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన నిందితుడు రియాజ్భత్కల్ ఇప్పటికి పరారీలో ఉన్నాడు. ఈ…
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ద్రోణి ప్రభావంతో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. బలమైన ఈదురుగాలులతో.. ఉరుములు, మెరుపులతో వర్షాలు బీభత్సం సృష్టించాయి. మండు వేసవిలో వర్షాలు కురవడంతో ప్రజలు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికి వచ్చిన పంట నీటిపాలవడంతో కన్నీరు పెడుతున్నారు. ఇప్పుడు మళ్లీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. రాగల రెండు గంటల్లో హైదరాబాద్ తో పాటు…
Maheshwaram: హైదరాబాద్ లోని మహేశ్వరం జోన్లో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనను మొదట యాక్సిడెంట్గా అనుమానించిన పోలీసులు, ఆ తర్వాత దర్యాప్తులో ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా తేల్చారు. భూతగాదాల వివాదం కారణంగా శంకరయ్య అనే వ్యక్తిని ప్రత్యర్థులు పక్క ప్లాన్ ప్రకారం హత్య చేశారు. శంకరయ్యను టార్గెట్ చేసిన నిందితులు.. అతను బైక్పై వెళ్తున్న సమయంలో కారుతో ఢీకొట్టి చంపారు. ఈ ఘటనను యాక్సిడెంట్గా మారుస్తూ తప్పుడు దిశగా మళ్లించే ప్రయత్నం చేశారు…
సీతారాంబాద్ ఆలయం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. భక్తుల జన సందోహం మధ్య శోభాయత్ర సాగుతోంది. జైశ్రీరామ్ నినాదాలతో సీతారాంబాద్ ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. సీతారాంబాగ్ ఆలయం నుంచి కోటి వ్యాయామ శాల వరకు శోభాయాత్ర సాగనుంది. శ్రీరాముని శోభాయాత్ర భద్రత విధుల్లో 20 వేల మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు.. ఈ శోభాయాత్ర సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పలు కీలక సూచనలు చేశారు.
ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. మంగళ్ హాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభం కానున్న ఈ శోభాయాత్ర మధ్యాహ్నం 1 గంటకు ర్యాలీగా బయలుదేరనుంది. సీతారాం భాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యయం శాలకు శోభాయాత్ర చేరుకోనుంది. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో నగర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు…
మద్యం ప్రియులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్...హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు 24 గంటల పాటు మూతపడనున్నాయి. నగరంలోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలో ఆదివారం పూర్తిగా మూతపడనున్నాయి. నేడు శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన నగరంలోని వైన్స్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామ నవమి పవిత్రమైన రోజున వాడవాడలా రామనామ స్మరణ మార్మోగుతున్న నేపథ్యంలో.. నేడు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు.