Weather Updates : తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్ష సూచన జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణ విషయానికి వస్తే, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, , హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. Peddireddy…
కొన్ని రోజుల క్రితం ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధర.. ఇటీవలి రోజుల్లో పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. నిన్న భారీగా పెరిగిన పసిడి రేట్లు.. ఈరోజు స్వల్పంగా తగ్గాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.540 తగ్గితే.. 22 క్యారెట్లపై రూ.500 తగ్గింది. బులియన్ మార్కెట్లో బుధవారం (మే 14) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,050గా.. 24 క్యారెట్ల ధర రూ.96,060గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.…
ఆసుపత్రుల నిర్మాణం ఆలస్యం అవుతుండడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కుంటిసాకులతో నిర్మాణాలను ఆలస్యం చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంట్రాక్టర్లతో పని చేయించడం కూడా రాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి.
పాతబస్తీలోని చార్మినార్ వద్ద మరి కొద్దిసేపట్లో ప్రపంచ సుందరీమణుల హెరిటేజ్ వాక్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మదీనా నుంచి చార్మినార్, చార్మినార్ నుంచి శాలిబండ వెళ్లే మార్గాలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
IPL In Hyderabad: ఐపీఎల్ 2025 మే 17 నుంచి మళ్లీ ప్రారంభమవుతున్నట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మే 8న ఐపీఎల్ నిలిపివేయబడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వ వర్గాలు, భద్రతా సంస్థలు, టోర్నీ నిర్వాకులతో విస్తృతంగా చర్చించిన అనంతరం మళ్లీ టోర్నీ కొనసాగించేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే కొత్త షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. Read Also:…
DRDO : భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, దేశ రక్షణ వ్యూహాల్లో హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కీలక భూమిక పోషిస్తోంది. దేశ భద్రతకు అవసరమైన అనేక ఆధునిక ఆయుధాల తయారీలో హైదరాబాద్ DRDO ల్యాబ్ నడిపిస్తున్న పరిజ్ఞానం ఇప్పుడు యుద్ధ సన్నాహాల్లో కీలకంగా మారింది. ఆకాష్, బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన క్షిపణుల నుంచి, సాంకేతికంగా ముందున్న యాంటీ డ్రోన్ సిస్టమ్ వరకు, అనేక ఆయుధ వ్యవస్థలు స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడానికి సిద్దమైంది. మరికాసేపట్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకలను అట్టహాసంగా ఆరంభం కానున్నాయి. మిస్ వరల్డ్ పోటీల కోసం విజిటర్స్ గేట్స్ శనివారం సాయంత్రం 5.30కు తెరుచుకున్నాయి. సాయంత్రం 6.30కు ఇనగ్యూరల్ సెరెమనీ ప్రారంభం కానుంది. అందాల పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మే 10న ప్రారంభమయ్యే పోటీలు.. మే 31 వరకు కొనసాగనున్నాయి.…
హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ఐపీఎల్ 2025 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన షార్ట్‌లిస్ట్ జాబితాలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఉంది. ఐపీఎల్ 2025లో మిగిలిన 16 మ్యాచ్‌ల కోసం బీసీసీఐ మూడు వేదికలను షార్ట్‌లిస్ట్ చేయగా.. లిస్ట్‌లో బెంగళూరు, చెన్నై సహా హైదరాబాద్ కూడా ఉంది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. భారత ప్రభుత్వం అనుమతి ఇస్తే.. ఈ మూడు నగరాల్లో…
పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తోందని, పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు అని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదన్నారు. భారత జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. చచ్చే వరకు భారత భూమి కోసమే బ్రతకాలని ఎమోషనల్ అయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ జనాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని హైదరాబాద్ ఎంపీ అన్నారు.…
HYDRAA Police Station: హైదరాబాద్ నగరంలోని బుద్ధ భవన్ సెకండ్ బ్లాక్ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన సీఎంకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ IPS స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కమిషనర్ రంగనాథ్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌లోని వసతులను పరిశీలించారు. ఇక హైడ్రా…