జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి నిఘా వైఫల్యమే కారణమని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ దాడిని ఊచకోతగా ఆయన అభివర్ణించారు. బుధవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఇది ఉరి ప్రాంతం, పుల్వామా సంఘటనల కంటే ప్రమాదకరమైందని, బాధాకరమైందన్నారు. ఈ సంఘటనపై నరేంద్ర మోడీ ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించాని డిమాండ్ చేశారు.
ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. బ్రిటిష్ వాళ్ళతో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది.. కాంగ్రెస్ పార్టీ విస్తృత భావజాలం ఉన్న పార్టీ.. కాంగ్రెస్ జాతీయ పార్టీ జాతీయ స్థాయి ఆలోచనలతో పార్టీ పని చేస్తుంది.. పార్టీ సిద్ధాంత ప్రచారం, సంస్థాగత పటిష్టత గ్రామస్థాయి నుంచి జరగాలి అని సూచనలు చేసింది. ఈ విషయంలో పార్టీ నాయకత్వం చాలా చిత్తశుద్ధితో సీరియస్ గా పని చేయాలని హెచ్చరించింది.
నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్, కౌంటింగ్ సాగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ ఆఫీసీయో సభ్యులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు.
లేడీ అఘోరీకి ఊహించని షాక్ ఇచ్చారు పోలీసులు. ఇటీవల పూజల పేరుతో తనను లక్షల్లో మోసం చేశాడని ఓ సినీ లేడీ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దద్యాప్తు చేశారు మోకిలా పోలీసులు. ఈ క్రమంలో మోకిలా పోలీసులు లేడీ అఘోరీని చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ,మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని అదుపులోకి తీసుకుని నగరానికి…
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు.. ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో నిందితుడిగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులును.. ఇవాళ ఉదయం బేగంపేటలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విజయవాడకు తరలించారు.. సాయంత్రంలోగా పీఎస్సార్ ఆంజనేయులును అరెస్ట్ చేసినట్టు అధికారికంగా చూపే అవకాశం ఉంది..
ఇటీవల పోలీస్ శాఖలో పలువురు అధికారులు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. వ్యక్తిగత కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ ఆకుల దీపిక ఆత్మహత్యకు పాల్పడింది. నాగోల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆకుల దీపిక(38) హస్తినాపురం టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.…
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పేరుతో సరికొత్త రాజకీయానికి తెర లేస్తోందంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్గా బీజేపీ సరికొత్త స్కెచ్ వేస్తున్నట్టు కనిపిస్తోందన్న చర్చ మొదలైంది రాజకీయవర్గాల్లో. ఈ ఎన్నిక ఫలితాలతో తనను తాను టెస్ట్ చేసుకోవడంతోపాటు... ప్రత్యర్థుల్ని దోషులుగా నిలబెట్టే ప్లాన్ ఉందని, అందుకే బలం లేకున్నా బరిలో నిలబడ్డట్టు కనిపిస్తోందంటున్నారు.
పతియే ప్రత్యక్ష దైవం నుంచి భర్తను పరలోకాలకు పంపించే వరకు చేరింది భార్యల తీరు. పరాయి వ్యక్తుల మోజులో పడి కొందరు, కుటుంబ కలహాలతో మరికొందరు భర్తలను అంతమొందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. భర్తతో విసిగిపోయిన భార్య కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని పూడ్చి పెట్టింది. నేరం నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ చేసింది. కానీ, బంధువులు అనుమానంతో వ్యక్తం చేసి పోలీసులకు…
పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. తెలంగాణలో ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ పలితాలు విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొననున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల…
విద్యా సంస్థల సమీపాల్లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ విక్రయిస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో (TGANB), హైదరాబాద్ సిటీ పోలీసులతో కలిసి అరెస్ట్ చేసింది. ఈ ముఠా చిన్నారులు, యువతపై లక్ష్యంగా ఈ ఉత్పత్తులను విక్రయిస్తోంది. సాదిక్ లలాని, అనిల్ లలాని అనే సోదరులు, నాంపల్లి ప్రాంతంలో నివసిస్తూ, “SID” అనే WhatsApp గ్రూప్ ద్వారా 500 మందికి పైగా సభ్యులకు ఈ ఉత్పత్తులను ఆన్లైన్లో ప్రొమోట్ చేసి విక్రయించేవారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా కొత్త స్టాక్…