హైదరాబాద్ లోని మీర్ పెట్ రాఘవేంద్రనగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వ్యాక్సిన్ వేయించుకున్న కొద్ది సేపటికే ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మీర్ పెట్ రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన నర్సిరెడ్డి అనే వ్యక్తి జిల్లేల్ గూడ వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద కోవిషీల్డ్ టీకా తీసుకున్నాడు. అయితే నర్సిరెడ్డి ఇంటికి వెళ్లిన 20 నిముషాల తరువాత కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు…
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ ని పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ కరోనా వేవ్ కారణంగా…
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి.. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. ఇక ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 45,800 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.49,970 కి…
కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పరీక్షలు రద్దు అయితే, మరికొన్ని పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి.. మరోవైపు.. వివిధ పోటీ పరీక్షల దరఖాస్తుల గడువులు కూడా పొడిగిస్తూ వస్తున్నారు.. తాజాగా, మరోసారి తెలంగాణ ఎంసెట్-2021 ఆన్లైన్ దరఖాస్తుల గడువును పొడిగించారు. దరఖాస్తు చేసుకోవడానికి మరో వారం రోజులు గడువు ఇచ్చారు.. లేట్ ఫీజు లేకుండా ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటించారు.. కాగా, ఎంసెట్‌కు ఇప్పటి వరకు 2,20,027 దరఖాస్తులు…
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై భారీగా నమోదయ్యాయి… అవసరం లేకపోయినప్పటికీ రోడ్లపైకి వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.. ఇప్పటికే తెలంగాణలో లక్షల వాహనాలు సీజ్ చేశారు.. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత వాహనాలను కోర్టుకు సమర్పిస్తామని చెబుతున్నారు.. ఈ ఉల్లంఘనలు ఎక్కువగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్ కమిషనరేట్ల పరిధిలో జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి.. ఇక, ఏప్రిల్ 1 నుంచి జూన్ 7వ తేదీ వరకు మొత్తం 8.79 లక్షల కేసులు నమోదు అయినట్టు…
రేపు సంగారెడ్డి జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఐకెపి సెంటర్లలో ఉన్న ధాన్యంను పరిశీలించనున్నారు. ఆ తరువాత అక్కడున్న రైతుల సమస్యల గురించి అడిగి తెలుకుంటారు. తెలంగాణలో సొంతంగా పార్టీని ఏర్పాటు చేయబోతున్న షర్మిల, పార్టీకి సంబందించిన జెండా, అజెండాను జులై 8 వ తేదీన ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈలోగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలపై పోరాటం చేసేందుకు వైఎస్ షర్మిల సిద్దం అవుతున్నారు. ఇందులో…
కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. చాలా రాష్ట్రాల్లో అన్‌లాక్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. తిరిగి మార్కెట్లు యధావిధిగా నడుస్తున్నాయి. కరోనా సమయంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పుత్తడి ఆ తరువాత తగ్గుతూ వచ్చింది. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధర రూ.45,900 వద్ద స్థిరంగా ఉండగా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,070 వద్ద నిలకడగా ఉన్నది. బంగారం…
తెలంగాణలో లాక్డౌన్ నిబంధనలు మారనున్నాయి. మరో పదిరోజుల పాటు కొనసాగనున్న లాక్డౌన్.. సడలింపు సమయం పెరగనుంది. ఇప్పటి వరకూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సడలింపు సమయం.. ఆ తర్వాత మరో గంట గ్రేస్ పీరియడ్‌గా ఉంది. రేపట్నుంచి ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు లాక్డౌన్ నుంచి సడలింపు ఉండనుంది. ప్రజలంతా ఇళ్లకు చేరుకునేలా మరో గంట వెసులుబాటు ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి ఉదయం 6 గంటల…
బ్యాంక్ రుణాల ఎగవేత కేసుల్లో దేశవ్యాప్తంగా 14 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.. ఢిల్లీ, గుర్గావ్తో పాటు హైదరాబాద్‌లోనూ సీబీఐ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. యెస్ బ్యాంక్ నుంచి 466 కోట్ల రూపాయల రుణం తీసుకుని ఎగ్గొట్టిన ఓయిస్టర్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్, అవంత రియాల్టీ లిమిటెడ్ కంపెనీలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఆ రెండు కంపెనీల డైరెక్టర్లు, ప్రమోటర్ల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. నకిలీ పత్రాలతో పొందిన రుణాలను పక్కదారి పట్టించినట్లు…