దేశం కరోనా మహమ్మారి నుంచి క్రమంగా కోలుకుంటోంది. రెండోదశ వేవ్ నుంచి బయటపడతుండటంతో అనేక రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. సాధారణ జీవనం తిరిచి ప్రారంభం కావడంతో మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్నాయి. ఈ మార్కెట్ల ప్రభావం బంగారం ధరలపై పడింది. గతంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా పెరిగిపోయి బంగారం ఇప్పుడు దిగి వస్తున్నది. ధరలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి.
Read: దుమ్మురేపుతున్న “సిగ్గెందుకురా మామ” సాంగ్
ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,100 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,110 వద్ద స్థిరంగా ఉన్నది. ఇకపోతే, కిలో వెండి మాత్రం రూ.400 తగ్గి రూ.73,400కి చేరింది.