కరోనా మహమ్మారికి చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎస్ సోమేష్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా వ్యాక్సిన్లను పోందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల అధికారులు, సిబ్బందికి వ్యాక్సిన్లను అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారంలోగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా హై ఎక్స్ పోజర్ కేటగిరీలో ఉన్న 12…
కరోనా అనంతరం బంగారం దిగిరావడంతో భారీ ఎత్తున కొనుగోలు పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు మాత్రం భారీగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 45,900 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర…
తెలంగాణ సీఎం కేసీఆర్‌ది ధృతరాష్ట్ర కౌగిలి అంటూ కామెంట్ చేశారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. టీఆర్ఎస్ నుంచి వలసలపై స్పందించిన ఆయన.. ఆలే నరేంద్రను వెళ్లకొట్టారు, విజయ శాంతి, స్వామి గౌడ్ వంటి ఎంతో మందిని బయటకు పంపించారు.. ఇప్పుడు ఈటల వంతు వచ్చిందన్నారు.. మధుసూదనాచారిని కేసీఆరే ఓడగొట్టారంటూ విమర్శించిన ఆయన.. ఇక, మిగిలింది హరీష్ రావే!.. హరిష్ రావుకు కూడా అనేక అవమానాలు జరిగాయని చెప్పుకొచ్చారు.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులు…
హైదరాబాద్‌లో ఓ బాలుడు నాలాలో కొట్టుకుపోయి మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది.. దీంతో బోయిన్‌పల్లిలో విషాదం నెలకొంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ప్రమాదవశాత్తు చిన్నతోకట్ట నాలాలో పడిపోయాడే ఏడేళ్ల బాలుడు ఆనందసాయి.. నాలా నిర్మాణంలో ఉండగా.. ఇంటిముందు ఆడుకుంటుండగా అందులో పడిపోయాడు… విషయం తెలుకున్న స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. దీంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టినా.. ఆ బాలుడు ప్రాణాలు దక్కలేదు.. నాలాలో పడిపోయిన ఆ బాలుడు మృతదేహంగా…
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి.. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. ఇక ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 పెరిగి రూ. 45,500 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760 పెరిగి రూ.49,640 కి…
కరోనా సమయంలో అంబులెన్స్‌లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.. ఒకవేళ దొరికినా అడిగినంత సమర్పించుకోవాల్సిన పరిస్థితి.. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో సేవా భారతి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. ఉచిత అంబులెన్స్ సేవలు కావాలనుకునేవారు 040-48213100 నంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు. బర్కత్‌పురా కేశవనిలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవాభారతి ప్రాంత అధ్యక్షుడు దుర్గారెడ్డి, కార్యదర్శి ప్రభల రామ్మూర్తి సహా ఇతర సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు. సేవా భారతి…
లాక్డౌన్ చర్యలు క్రమంగా కరోనా కేసులు తగ్గేలా చేస్తున్నాయి.. తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 2,175 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. కరోనా బారినపడి మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో.. 3,821 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 30,918 యాక్టివ్ కేసులు…
తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల… ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో.. తన అనుచరుడితో కేంద్ర ఎన్నికల కమిషన్‌లో రిజిస్ట్రర్ చేయించారు.. అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ ఓ ప్రకటన కూడా చేశారు.. మరోవైపు పార్టీ నిర్మాణంపై కూడా దృష్టి సారించారు.. తాజాగా, వైఎస్ షర్మిల ఆదేశానుసారం.. అడ్ హక్ అధికార ప్రతినిధులను నియమించినట్టు ఆమె కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.. ఆ ప్రకటన ప్రకారం వైఎస్ఆర్టీపీ అధికార ప్రతినిధులుగా..…
టీఆర్ఎస్ బహిస్కృత నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. ఉరిశిక్షపడిన ఖైదీకి కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, కానీ, ఏం జరిగిందో తెలుసుకోకుండా చర్యలు తీసుకున్నారని, రాత్రికి రాత్రే విచారణ చేసి బర్త్‌రఫ్ చేశారని ఈటల ఆరోపించారు. 19 ఏళ్లుగా టీఆర్ఎస్లో ఉన్నానని, ఓ అనామకుడు లేఖరాస్తే రాత్రికి…
ఎల్బీనగర్ లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఓ వ్యాపారిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మాడ్గుల మండలం పాత బ్రాహ్మణపల్లికి చెందిన వెంకటయ్య వినాయక ట్రేడర్స్ పేరుతో విత్తనాల విక్రయ వ్యాపారం చేస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు & మాడ్గుల పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. దాదాపు 25 వేల ఎకరాల విస్తీర్ణానికి సరిపోయే విత్తనాలు వినాయక ట్రేడర్స్‌లో బయటపడ్డాయి. 43 లక్షల విలువ చేసే 2835 కిలోల పత్తి విత్తనాల ప్యాకెట్లను…