అల్వాల్ పీఎస్ పరిధి హస్మత్ పేట్ సత్య సాయి ఎంక్లేవ్ లో మంగతాయారు 72 వృద్దురాలును దారుణంగా హత్య చేసాడు ఇంట్లో కిరాయి ఉంటున్న వ్యక్తి. బాత్రూమ్ లో మృతదేహాన్ని దాచిపెట్టాడు నిందితుడు. నిన్న సాయంత్రం మంగతాయారు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి వెతకడం మొదలు పెట్టిన పోలీసులు… రాత్రి సమయంలో అదే ఇంట్లో మూడవ అంతస్తులో కిరాయికి ఉంటున్న సురేష్ ఇంట్లోని బాత్రూమ్ లో మృతదేహం దొరికింది. మంగతాయారును బాత్రూమ్ లోకి తీసుకువెళ్లి చిత్ర హింసలకు గురిచేసి అతి కిరాతకంగా చంపాడు హంతకుడు సురేష్. నిందితున్ని అదుపులోకి తీసుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు… పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.