తెలంగాణలో బోనాల ఉత్సవాలను ప్రతి ఏడాడి ఏరువాక తరువాత అగరంగవైభవంగా జరుపుతుంటారు. వాతావరణంలో మార్పులు వచ్చిన తరువాత, ఎలాంటి రోగాలు, మహమ్మారులు రాకుండా కాపాడాలని వేడుకుంటూ బోనాల పండుగను నిర్వహిస్తుంటారు. కరోనా కాలంలో బోనాలను ఎలా నిర్వహించాలి అనే అంశంపై ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షను నిర్వహించారు. బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
Read: 500 చిత్రాల్లో నటించిన అనుపమ్ ఖేర్ అమాయకుడి చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు!
కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ బోనాలను నిర్వహిస్తామని అన్నారు. జులై 11న గోల్కొండ మహంకాళి అమ్మవారికి తొలిబోనం ఉంటుందని, జులై 25న సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు ఉంటాయని, 26న రంగం ఉంటుందని అన్నారు. ఇక, ఆగస్టులో లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు ఉంటాయని అన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.