సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది రియలో.. ఏది వైరలో తెలియని పరిస్థితి… కొందరు కేటుగాళ్లు ఇష్టంవచ్చినట్టుగా తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు.. అది తెలియకకొందరు.. తెలిసి మరికొందరు షేర్ చేస్తూ.. అందులో భాగస్వాములు అవుతున్నారు.. అయితే, తెలంగాణ మంత్రి కేటీఆర్, వైఎస్ షర్మిల ఫొటోలతో.. హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించిన ఓ తప్పుడు వార్త వైరల్ చేశారు కేటుగాళ్లు.. దీనిపై వైఎస్ షర్మిల అనుచరులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. బుధవారం రోజు సోషల్ మీడియాలో మేం పెట్టబోయే పార్టీపై అసూయతో.. రాజన్న పేరుతో మమ్మల్ని కించపరిచే పనులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందిర శోభన్.. లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. షర్మిల, కేటీఆర్ ఫొటోలు షేర్ చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారంటూ బీజేపీ శ్రేణులపై ఫైర్ అయ్యారు.. సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలు చేసే వారిపైనే లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించిన ఆమె.. మైండ్ గేమ్ ఆడితే ఎవరు భయపడే పనిలేదన్నారు.
also read: మంత్రి ప్రశాంత్‌రెడ్డిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
తమ పార్టీపై అబద్దాలు చెప్పడం వల్ల ఒరిగేదేమి లేదన్నారు ఇందిర శోభన్.. బీజేపీ కుటిల రాజకీయాలు చేయడంలో దిట్ట అని విమర్శించిన ఆమె.. ఈ రుమోర్స్ వెనుకాల పూర్తిగా బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు.. బీజేపీ శ్రేణులు అంతా అబద్దాలు చెబుతూ ఆత్మ సంసృప్తి చెందుతున్నారని ఎద్దేవా చేసిన ఆమె.. ప్రజల కష్టాలు తీర్చడంలో బీజేపీ పూర్తిగా విఫలం అయ్యిందని ఫైర్ అయ్యారు.. దుబ్బాకలో కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ వచ్చారన్న ఆమె.. ఇలాగే రూమర్స్ చేయడంలో బీజేపీకి పరిపాటిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. దయచేసి కేంద్రం నిధులు సక్రమంగా ఖర్చు చేసేలా చూడాలని.. కానీ, చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు.. బీజేపీ – అంటే బడా జూటా పార్టీ అంటూ కామెంట్ చేసిన ఆమె.. దమ్ముంటే మా వైఎస్ షర్మిల కార్యాచరణ విషయంలో.. విధానంలో పోటీపడాలన్నారు.. పార్టీ నాయకులని కొనడంతో మీరు ముందున్నారంటూ బీజేపీపై సెటైర్లు వేసిన ఇందిర శోభన్.. బీజేపీకి దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తెల్చుకుందాం రండీ అంటూ సవాల్ చేశారు.. సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారామె.