తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,088 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 9 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే, సమయంలో 1511 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.. దీంతో… పాజిటివ్ కేసుల సంఖ్య 6,17,776కు పెరగగా… రికవరీ కేసులు 5,98,139కి చేరగాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో 3,607 మంది మృతిచెందినట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం రాష్ట్రంలో 16,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. గడిచిన 24 గంటల్లో 1,19,466 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రికవరీ రేటు దేశవ్యాప్తంగా 96.58 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 96.82 శాతంగా ఉందని బులెటిన్‌లో తెలిపింది తెలంగాణ సర్కార్.