కరోనా మహమ్మారి కట్టడిలో ఇప్పుడు వ్యాక్సిన్ల పాత్ర కీలకమైనది.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయగా.. మరోవైపు.. ఉత్పత్తి కూడా అదే స్థాయిలో జరుగుతోంది.. ఇక, ఈ సమయంలో.. వ్యాక్సిన్ తయారీ చేస్తున్న సంస్థల దగ్గర భారీ భద్రత కల్పిస్తోంది సర్కార్.. ‘కోవాగ్జిన్’ తయారు చేస్తోన్న హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థకి భద్రత కల్పించారు.. హైదరాబాద్ శామీర్‌పేట్‌లో ఉన్న భారత్ బయోటెక్ ప్లాంట్ దగ్గర సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ అండ్ సెక్కూరిటీ ఫోర్స్)తో భద్రత పటిష్టం చేశారు.. పారా మిలిటరీ…
మాజీ మంత్రి ఈటల రాజేదర్.. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరిన వేళ ఆ పార్టీపై సెటైర్లు వేశారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ… నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు, రెండు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలను ప్రస్తావించారు.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సెక్యూరిటీ డిపాజిట్‌ను దక్కించుకోవడంలో బీజేపీ విఫలమైందని ఎద్దేవా చేసిన ఆయన.. ఇక, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కోల్పోయిందని విమర్శించారు.. మరోవైపు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్‌చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్ తో పాటుగా ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, రమేష్ రాథోడ్, అశ్వద్ధామ రెడ్డి, ఓయు జేఏసీ నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ రోజు ఉదయం శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ కేంద్రకార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చేరికలు చేరాయి. బీజేపీ చేరిన తరువాత ఈటల మాట్లాడారు.…
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఆల్‌టైమ్ స్థాయిలో ధరలు నమోదయ్యాయి. లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు పెరగ్గా, డీజిల్‌పై 31 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో రూ.100.26 పైసలకు చేరింది. పెరిగిన పెట్రోల్ ధరలపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిన సంగతి తెలిసిందే. దేశంలో పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ ఆంధోళనలు చేస్తున్నది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్…
హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ ఉదయం 11ః30 గంటలకు బీజేపీలో చేరబోతున్నారు. ఉదయాన్నే ఈటల శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢల్లీకి బయలుదేరారు. ఈటలతో పాటుగా మరో 20 మంది కూడా అదే విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. బీజేపీ జాతీయ ఆధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల, ఆయన అనుచర వర్గం బీజేపీలో చేరనున్నారు. దేవరయాంజల్ భూములను ఈటల అక్రమంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలు రావడంతో ఆయన్ను…
ఈరోజు తెల్లవారుజాము నుంచి నగరంలో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడటంతో లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. తెల్లవారు జాము 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వర్షం కురిసింది. నైరుతీ రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు రోజులుగా వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గి రూ.45,740కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.410 తగ్గి రూ.49,890కి చేరిది. చాలా రోజుల తరువా 24 క్యారెట్ల బంగారం…
గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి.. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. కానీ ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 45,750 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరిగి రూ.49,900 కి…
30 వేల మందికి ఉచిత పౌష్టికాహార పంపిణీ జరిగిన సందర్భంగా వేదం ఫౌండేషన్ లోగో ను విప్లవ్ కుమార్ లాంచ్ చేశారు. గత 25 రోజులుగా వేదం ఫౌండేషన్ కరోనా బాధితులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని గాంధీ, నిలోఫర్, ఫీవర్ హాస్పిటల్స్ లో కరోనా బాధితులకు వారితో ఉన్న అటెండర్స్ మరియు వైద్య సిబ్బందికి, RTC సిబ్బందికి కూడా ఉచిత పౌష్టికాహార పంపిణీ చేస్తుంది వేదం ఫౌండేషన్. ఇప్పటి వరకు 30…
భాషా సాహిత్యాలు నిలిచివున్నన్నాళ్లు ప్రజల హృదయాల్లో సినారె చిరకాలం నిలిచివుంటారని స్మరించుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరావ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా. సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన కేసీఆర్.. కవిగా, రచయితగా, గేయ కావ్య కృతి కర్తగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, సినీ గీతాల రచయితగా, తనదైన ప్రత్యేకశైలిలో తెలంగాణ పద సోయగాలను వొలికిస్తూ సాహితీ ప్రస్థానాన్ని…