గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి. బంగారం దిగిరావడంతో భారీ ఎత్తున కొనుగోలు పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. కానీ ఈరోజు మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 45,900 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల…
తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ పేరు చెప్పగానే ముందు గుర్తుకు వచ్చే వాటిలో నెక్లెస్ రోడ్ కూడా ఒక్కటి. అయితే ఈ నెక్లెస్ రోడ్ విషయంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళిగా నెక్లెస్ రోడ్ పేరును పీవీఎన్ఆర్ మార్గ్ గా మార్చింది. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు జరిగిన తెలంగాణ కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 1921 జూన్ 28 న పుట్టిన…
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ తెలంగాణ క్యాబినెట్ సమావేశం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ విజ్ఞప్తి చేశారు. అందులో తెలుగులో ట్వీట్ చేయడం గమనార్హం. లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సమావేశమవుతోందని… లాక్ డౌన్ పై తన వ్యతిరేకతను మరోమారు స్పష్టం చేస్తున్నానని పేర్కొన్నారు. కోవిడ్ 19 ను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు…దీంతో పేదల జీవితాలు నాశనమవుతాయని తెలిపారు.…
గతఐదు రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు ఈరోజు తిరిగి భారీగా పెరిగాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అనుకున్న వినియోగదారులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ధరలు పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 45,800 కి చేరింది. 10 గ్రాముల…
తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. జిల్లాలో రోజురోజుకు కోవిడ్ కేసులు తగ్గుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. గడచిన 24 గంటల్లో 1,00,677 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,982 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 436 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఇదే అత్యల్పం. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఉద్ధృతి మరింత…
99 శాతం మంది లాక్డౌన్ను సహకరిస్తున్నారని తెలిపారు హైదరాబాద్ పోలీస్ కమిషన్ అంజనీ కుమార్.. పాతబస్తీ, సౌత్ జోన్, సెంట్రల్ జోన్లో లాక్ డౌన్ అమలు తీరును పర్యవేక్షించిన ఆయన.. పాతబస్తీ మదిన చెక్ పోస్ట్ను పరిశీలించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో లాక్ డౌన్ అమలు అవుతుందని.. 99 శాతం ప్రజలు పోలీసులకు సహకరిస్తున్నారని.. కేవలం 1 శాతం మంది ప్రజలు, యువకులు మాత్రమే అనవసరంగా బయటికి వస్తున్నారని.. అలాంటి వారిని గుర్తించి…
కరోనా రోగులు ఆస్పత్రుల్లో ఉంటే.. వారికి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియక.. వారి అటెండర్లు పడిగాపులు పడాల్సిన పరిస్థితి.. కరోనా పేంషట్ల పరిస్థితి ఎలా ఉన్నా.. వారి అటెండర్ల పరిస్థితి దారుణంగా తయారైంది.. ఆహారానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొనగా.. దానికి తోడు లాక్డౌన్ వారి కష్టాలను రెట్టింపు చేసింది.. అయితే, ఇంత కాలం కోవిడ్ రోగులకు ఇంటి వద్దకే వెళ్లి భోజనం అందిస్తూ వస్తున్న వేదం ఫౌండేషన్.. ఇప్పుడు మరో అడుగు ముందుకు…
కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్రో ధరలు పెరుగుదల సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి.. కానీ, ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందో.. అప్పటి నుంచి ఆగిపోయాయి.. కొన్ని సార్లు తగ్గాయి తప్పితే.. పెరిగింది మాత్రం లేదు.. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్…
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సమ్మర్లో కరోనా కేసులతో పాటుగా బంగారం ధరలు కూడా పెరగడం మొదలుపెట్టాయి. అయితే ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి. తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 45,700 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 240 తగ్గి రూ. 49,860కి చేరింది. దేశీయంగా అనేక…
కరోనా మహమ్మారి ఓ వైపు కల్లోలం సృష్టిస్తే.. మరోవైపు.. అదే అదునుగా అందినకాడికి దండుకుంటూ.. సామాన్య, మధ్య తరగతి ప్రజల ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు.. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి 66 ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు అందగా.. అన్ని ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.. ఇక, మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలను ప్రారంభించింది సర్కార్… బంజారాహిల్స్ లోని విరించి ఆస్పత్రికి కోవిడ్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఇక…