గతకొన్ని రోజులుగా పేరుగ్గుతూ తగ్గుతూ పుత్తడి ధరలు ఈరోజు స్థిరంగా పెరిగాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అనుకున్న వినియోగదారులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ధరల్లో నిరంతరం తేడాలు ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,500 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల…
హైదరాబాద్ మంగల్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గోదాంపై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు. ఆకాష్ అనే వ్యాపారి మంగల్హాట్ అగపురా సీతారాంబాగ్ లోని గోదాంలో అక్రమంగా ఫారెన్ సిగరెట్లను నిల్వ ఉంచి విక్రయిస్తున్నాడు. పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. రూ.20 లక్షల విలువ చేసే విదేశీ కంపెనీకి చెందిన ఫారిన్ సిగరెట్లను పోలీసులు సీజ్ చేశారు. పారిస్, బ్లాక్ సిగరెట్స్ దాదాపు 480 సిగరెట్ ప్యాకెట్…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాజ్ భవన్ లో మొక్కను నాటారు. అనంతరం మొక్కకు నీటిని పోశారు. ఆపై ఎంవీ సంతోష్ కుమార్ వృక్షవేదం పుస్తకాన్ని సీజేఐకి బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈమేరకు ఎన్వీ రమణను…
ఈ రోజు, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.. నిన్నటి ఝార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనము ఈరోజు తెలంగాణ నుండి దూరంగా వెళ్ళిపోయింది. నైరుతి రుతువనాలు తెలంగాణాపై చురుకుగా కదులుతున్నవని.. ఈ రోజు క్రింది స్థాయి నుండి పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో.. రాగల మూడు రోజులు (15,16,17వ తేదీలు) తేలికపాటి…
టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ నిన్నటిరోజున బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ధర్మేంధ్రప్రధాన్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కాగా, ఈరోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. బీజేపీలో చేరిన ఈటలపై టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిరోజే ఈటలకు పరాభవం ఎదురైందని, నడ్డా సమక్షంలో ఈటల ఎందుకు చేరలేదని విమర్శించారు. కమ్యునిస్టుల భావజాలం ఎక్కడపోయిందని, ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల బీజేపీలో చేరారని అన్నారు. టీఎంసీలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేసి బీజేపీ…
తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నది. రోజూ లక్షలాదిమందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చెపడుతున్నారు. ఇందులో భాగంగా పోలీసుల ఆద్వర్యంలో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులకు, వారి కుటుంబసభ్యులకు, వారి బంధువులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఈరోజు హోంశాఖా మంత్రి,సీపీ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో లాక్డౌన్ సత్ఫలితాలను ఇస్తోందని, త్వరలోనే రాష్ట్రంలో తిరిగి మాములు జీవనం ఆరంభం…
రెండు రోజుల క్రితం వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియిన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.240 తగ్గి రూ.45,500 కి చేరింది. 10 గ్రాముల24 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ.49,640కి చేరింది. బంగారం ధరలు భారీగా తగ్గుతుండటంతో పుత్తడిని కొనుగోలు చేసేందుకు…
కరోనా మహమ్మారి కట్టడిలో ఇప్పుడు వ్యాక్సిన్ల పాత్ర కీలకమైనది.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయగా.. మరోవైపు.. ఉత్పత్తి కూడా అదే స్థాయిలో జరుగుతోంది.. ఇక, ఈ సమయంలో.. వ్యాక్సిన్ తయారీ చేస్తున్న సంస్థల దగ్గర భారీ భద్రత కల్పిస్తోంది సర్కార్.. ‘కోవాగ్జిన్’ తయారు చేస్తోన్న హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థకి భద్రత కల్పించారు.. హైదరాబాద్ శామీర్‌పేట్‌లో ఉన్న భారత్ బయోటెక్ ప్లాంట్ దగ్గర సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ అండ్ సెక్కూరిటీ ఫోర్స్)తో భద్రత పటిష్టం చేశారు.. పారా మిలిటరీ…
మాజీ మంత్రి ఈటల రాజేదర్.. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరిన వేళ ఆ పార్టీపై సెటైర్లు వేశారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ… నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు, రెండు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలను ప్రస్తావించారు.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సెక్యూరిటీ డిపాజిట్‌ను దక్కించుకోవడంలో బీజేపీ విఫలమైందని ఎద్దేవా చేసిన ఆయన.. ఇక, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కోల్పోయిందని విమర్శించారు.. మరోవైపు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్‌చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్ తో పాటుగా ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, రమేష్ రాథోడ్, అశ్వద్ధామ రెడ్డి, ఓయు జేఏసీ నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ రోజు ఉదయం శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ కేంద్రకార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చేరికలు చేరాయి. బీజేపీ చేరిన తరువాత ఈటల మాట్లాడారు.…