కోవిడ్ థర్డ్ వేవ్ గురించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నందుకు ఇంజనీర్ పరుచూరి మల్లిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ జి. శ్రీనివాస్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇదివరకే నోటీసులు పంపించారు. పరుచూరి మల్లిక్ ఓ టీవీ టాక్ షోలో పాల్గొని, కరోనా థర్డ్ వేవ్‌లో ప్రతి ఒక్క ఇంటి నుంచి మరణం సంభవిస్తుందని వ్యాఖ్యలు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా, సుల్తాన్ బజార్ పోలీసులు విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 54 మరియు భారత శిక్షాస్మృతిలోని 505 (బి) కింద పరుచురి మల్లిక్ పై కేసు నమోదు చేశారు. పోలీస్ సూచన మేరకు సోమవారం మాలిక్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో హాజరు అయ్యాడు. మల్లిక్‌ను విచారించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని సుల్తాన్ బజార్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అయితే, తాజాగా సుల్తాన్ బజార్ పీఎస్ లో స్టేషన్ బెయిల్ తీసుకొని మల్లిక్ వెళ్లిపోయారు.