పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధి కోసం ఇండియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రుణాల వసూలుకు సంబంధించి బ్యాంకులు కొంత ఉదారంగా వ్యవహరించి అవి తిరిగి గాడిన పడే ప్రయత్నం చేయాలన్నారు.. ఎంఎస్ఎంఈ రంగానికి కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు, రుణాల లింకేజీ విషయంలో కొంత సంక్లిష్టత ఉందన్న కేటీఆర్.. ఎంఎస్ఎంఈ రంగ కంపెనీలను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు వెల్లడించారు.
ఇక, స్వయం సహాయక సంఘాలు గత రెండు దశాబ్దాలుగా తీసుకున్న రుణాలకు అద్భుతమైన రీపేమెంట్ శాతాన్ని కలిగి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు మంత్రి కేటీఆర్. ఇండియన్ బ్యాంకుతో ఇప్పటికే కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఉందని తెలిపారు. అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ డెవలప్‌మెంట్ రంగంలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు.. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన టీ-హబ్ మరియు వి-హబ్ లో భాగస్వాములు కావాలని.. రాష్ట్రంలో ఇండియన్ బ్యాంక్ మరింతగా విస్తరించి అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని ఆకాంక్షించారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రుణాల వసూలుకు సంబంధించి బ్యాంకులు కొంత ఉదారంగా వ్యవహరించి, అవి తిరిగి గాడిన పడే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు కేటీఆర్.