ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతున్నది. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.90 కాగా, డీజిల్ ధర రూ.94.82 చేరింది. ఈ జూన్ నెలలో ఇప్పటివరకు ఆరు సార్లు ఇంధన ధరలుపెరగ్గా.. మే 4వ తేదీ నుంచి…
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ మధ్యే గాంధీ ఆస్పత్రిని, వరంగల్ ఎంజీఎంను సందర్శించి కోవిడ్ బాధితులను పరామర్శించి భరోసా కల్పించిన ఆయన.. ఇప్పుడు మరింత దూకుడు పెంచుతున్నారు.. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును.. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఈ నెల 19 వ తేదీ తర్వాత ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించనున్నారు.. ఇక, ఇందులో భాగంగా.. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల క్షేత్రస్థాయి పనితీరును సమీక్షించడానికి…
తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఇక, హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూనే ఉంది.. మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో.. సాయంత్రం మరికొన్ని ప్రాంతాల్లో.. రాత్రికి ఇంకొన్ని ప్రాంతాల్లో అన్నట్టుగా వర్షం దంచికొట్టింది.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.. వరుసగా మూడు రోజుల పాటు.. అంటే ఈ నెల 12, 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో భారీ నుంచి…
తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ.. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.. ఇందులో భాగంగా కొంతమంది నేతలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరగా.. తాజాగా, టీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఇవాళ ఈటల రాజేందర్‌తో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్…
తెలంగాణపై క్రమంగా ఫోకస్ పెంచుతోంది భారతీయ జనతా పార్టీ.. వరుసగా కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో పర్యటిస్తూ.. రాష్ట్ర నాయకత్వాన్ని అలర్ట్ చేస్తోంది.. ఇక, పశ్చిమ బెంగాల్ తరహాలోనే తెలంగాణపై కూడా దృష్టి పెట్టబోతున్నాం అని తెఇపారు ఆ పార్టీ నేత శివ ప్రకాష్… హైదరాబాద్‌లో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్లలో పార్టీని బలోపేతం చేయాలి.. రాష్ట్ర నాయకులతో ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతా… మీ మనసులో మాట అప్పుడు చెప్పండి అని…
తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించాల్సిన టెన్త్, ఇంటర్ పరీక్షలు కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు.. షెడ్యూల్ ప్రకారం జులైలో పరీక్షలు జరగాల్సి ఉండగా.. పరీక్షలపై నివేదిక పంపించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది ప్రభుత్వం.. రెగ్యులర్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఓపెన్ స్కూల్స్ సొసైటీ పరీక్షలు రద్దు చేయాలని రిపోర్ట్ ఇచ్చారు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు.. అయితే, దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.. గతేడాది కూడా రద్దు…
హైదరాబాద్ లోని మీర్ పెట్ రాఘవేంద్రనగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వ్యాక్సిన్ వేయించుకున్న కొద్ది సేపటికే ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మీర్ పెట్ రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన నర్సిరెడ్డి అనే వ్యక్తి జిల్లేల్ గూడ వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద కోవిషీల్డ్ టీకా తీసుకున్నాడు. అయితే నర్సిరెడ్డి ఇంటికి వెళ్లిన 20 నిముషాల తరువాత కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు…
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ ని పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ కరోనా వేవ్ కారణంగా…
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి.. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. ఇక ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 45,800 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.49,970 కి…