కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. క్రమంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి మొగ్గు చూపుతున్నా.. కొన్ని భయాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి.. అయితే, అక్కడక్కడ నర్సులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. హైదరాబాద్ శివారులో విధుల్లో ఉన్న నర్సు ఫోన్ మాట్లాడుతూ.. ఓ యువతికి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ వేసింది.. కాసేపటికి కళ్లు తిరిగిపడిపోయిన ఆ యువతిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చాల్సిన పరిస్థితి వచ్చింది.. వివరాల్లోకి వెళ్తే.. అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్ వ్యాక్సినేషన్…
బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 తగ్గి రూ.44,250కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.640 తగ్గి రూ.48,270 కి చేరిది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవడంతో…
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాకముందే.. మరోవైపు థర్డ్ వే భయాలు ప్రజలను వెంటాడుతున్నాయి.. అయితే, థర్డ్ వేవ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. అనవసరంగా ప్రజలను భయపెట్టకూడదని సూచించారు.. ఇవాళ హైదరాబాద్‌లోని దుర్గా భాయ్ దేశముఖ్ ఆస్పత్రిని సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి ప్రపంచాన్నిపట్టి పీడిస్తోందన్నారు.. యూరప్, యూకే లాంటి దేశాలతో పోలిస్తే మన లాంటి దేశాలలో కోవిడ్‌ని అడ్డుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు…
హైదరాబాద్ లోని ఓ నగల వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వ్యాపారం నిమిత్తం మురళీకృష్ణ ఈ నెల 10న ముంబై నుంచి రూ.1.2 కోట్ల విలువైన వజ్రాలు, జాతిరత్నాలు తీసుకువచ్చారు. మురళీకృష్ణకు హైదరాబాద్‌లో మూడు ప్రాంతాల్లో వజ్రాలు, జాతిరత్నాల దుకాణాలు ఉన్నాయి. కాగా, ముధురానగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న మురళీకృష్ణ.. లాక్డౌన్ నేపథ్యంలో అక్కడే వజ్రాలు, జాతిరత్నాలు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో మిగిలిన వజ్రాలు, జాతిరత్నాలను ఇంట్లోనే ఉంచి ఆయన బయటకు వెళ్లాడు. మురళీకృష్ణ…
గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. మొదట అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. కానీ ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగి రూ. 44,850 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 పెరిగి రూ.48,930 కి…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించ రాదని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రొగ్రామ్(సీఆర్ఎంపి) కింద ఏర్పాటు చేసిన రోడ్డుపై మ్యాన్‌హోల్ లేని ఉదంతంపై తక్షణమే భాద్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని గురువారం ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మున్ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు, తెలంగాణ శాసన మండలి ద్వారా 2020 సంవత్సరంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో స్థాపించబడింది. 200 ఎకరాలలో విస్తరించిన విశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ విశ్వ విద్యాలయం పారిశ్రామిక ప్రయోజనకరమైన ప్రత్యేకమైన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉన్నతమైన నాణ్యత కలిగిన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది. నిరంతరం సరికొత్త విధానాలను అన్వేషిస్తూ, వాటిని అనుసరిస్తూ, నిరంతరాయంగా నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు కృషి చేస్తున్నది.…
తెలంగాణలో రానున్న మరో మూడు రోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.. రేపు,ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.. ఇక, రాగల మూడు రోజుల పాటు.. ఇవాళ, రేపు, ఎల్లుండి.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం పడుతుందని.. ఒకటి, రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక, రాష్ట్రంలో నైరుతి…