ప్రస్తుతం మన దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుపై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడంతో పెట్రోల్, డీజీల్ ధరలు సెంచరీ దాటేశాయి. పెరుగుతోన్న ఇంధన ధరలతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
read also : తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు !
తాజాగా లీటర్ పెట్రోల్ పై రూ. 35 పైసలు పెరగగా.. డీజిల్ ధర మాత్రం నిలకడగా ఉంది. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.78గా నమోదు కాగా.. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో రూ. 99.86 కు చేరింది. అలాగే.. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.84 గా నమోదు కాగా.. ముంబైలో రూ. 105.92 కు చేరింది.