జల జగడం.. వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కాకరేపుతోన్న జల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేవారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల… హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో వివిధ అంశాలపై స్పందించిన ఆమె.. నదీ జలాల విషయంపై వ్యాఖ్యానిస్తూ.. కృష్ణా నది మీద రెండేళ్లుగా ప్రాజెక్టులు కడితే సీఎం కేసీఆర్ ఇప్పుడే కళ్ళు తెరిచారా? అంటూ ఫైర్ అయ్యారు.. ఇద్దరు సీఎంలు కౌగిలించుకోవచ్చు.. కలిసి భోజనాలు చేయొచ్చు.. స్వీట్లు తినినిపించుకోవచ్చు… కానీ, రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడుకోలేరా? అని ప్రశ్నించారు.. ఇక, కేంద్రంలో అధికారంలో బీజేపీ, బోర్డులతో కలిసి ఎందుకు సమస్య పరిష్కారం చూపడం లేదన్న ఆమె.. అసలు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చిత్తశుద్ధి ఉందా? అని నిలదీశారు.. అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలేనంటూ కామెంట్ చేసిన షర్మిల.. వైఎస్సార్ టిపి వైఖరి…. గోదావరి నది మీద ప్రాణహిత నుంచి పులిచింతల వరకు ఏ ప్రాజెక్టులోనైనా తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని వదులు కోసం… ఇతర ప్రాంతాలకు చెందిన ఒక్క చుక్కా మాకు వద్దు అని స్పష్టం చేశారు.
సమన్యాయం జరగాలని వైఎస్సార్ టిపి కోరుకుంటుందన్నారు వైఎస్ షర్మిల.. ఇక, తెలంగాణ కాంగ్రెస్ కు వైఎస్సార్ పేరు ఉచ్చరించే అర్హత లేదన్న ఆమె.. వైఎస్సార్ అసలైన వారసులం మేమే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసులం మేమే అన్నారు.. మరోవైపు.. బీజేపీ దగ్గర కేసీఆర్ కు సంబంధించిన ఆధారాలు ఉంటే ఎందుకు బయట పెట్టడం లేదు? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ప్రశ్నించారు షర్మిల.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఏదైనా లోపాయకారి ఒప్పందం చేసుకుందా? అని ప్రశ్నించారు. ఇక, వైఎస్సార్ గురించి తప్పుగా మాట్లాడితే లక్షల్లో ఉన్న వైఎస్ అభిమానులు ఉరికించి ఉరికించి కొడతారని హెచ్చరించారు.
Also Read
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
తాజావార్తలు
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
-
Sanju Samson: అప్పుడే ఆత్మవిశ్వాసం పెరిగింది.. భయం లేకుండా క్రికెట్ ఆడుతా.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Women’s Health: మాంసం తినే మహిళలు వందేళ్లు బతుకుతారా?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!