దేశంలో సంస్కరణలు ప్రవేశపెట్టి అన్ని దేశాలతో సమానంగా అభివృద్ది చెందేందుకు కృషిచేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఏడాదిగా శతజయంతోత్సవాలను నిర్వహించిది. ఈరోజు పీవీ జయంతితో శత జయంతి ఉత్సవాలకు ముగింపుపలికారు. ఇందులో భాగంగా ఇప్పటికే నెక్లెస్ రోడ్ని పీవీ మార్గ్ మార్చింది ప్రభుత్వం. పీవీ మార్గ్ లో పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఈరోజు ఉదయం11 గంటలకు గవర్నర్…
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి సాధారణ జీవనం ప్రారంభం అయింది. దీంతో జులై 1 వ తేదీనుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కాలేజీలు తిరిగి రీ ఓపెన్ చేశారు. జులై 1 నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కాబోతున్న తరుణంలో విద్యాశాఖ అధికారుతలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక సమీక్షను నిర్వహించబోతున్నారు. విద్యాసంస్థలు, ఆన్లైన్ క్లాసులు, మార్గదర్శకాలపై సమీక్షించబోతున్నారు. అదేవిధంగా, జులై నెలలోనే డిగ్రీ, పీజీ పరీక్షలు జరగాల్సి ఉన్నది.…
దేశంలో సంస్కరణలు తీసుకొన్ని, అభివృద్దిబాటలో నడిపించిన ప్రధానీ పీవీ నరసింహారావు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధి మరణం తరువాత, కాంగ్రెస్ పార్టీలో, దేశంలో నెలకొన్న అనిశ్చితి తొలగించేందుకు సమర్ధుడైన వ్యక్తిని ప్రధానిగా నియమించాలని అప్పటి కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. పీవీ ప్రధాని అయ్యాక, అనేక సంస్కరణలు తీసుకురావడంతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది దిశగా అడుగులు వేసింది. పీవీ నరసింహారావు తెలుగు వారు కావడం, అందులోనూ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో రాష్ట్రంలో గత ఏడాది కాలంగా…
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి. బంగారం దిగిరావడంతో భారీ ఎత్తున కొనుగోలు పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. అయితే ఈరోజు మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44,110 కి…
హైదరాబాద్ నగరం మళ్ళీ మునిగింది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని నాగమయ్య కుంట నిండి.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దయానంద్ నగర్, సాయి చరణ్ కాలనీ ఇళ్లలోకి నీరు చేరడంతో ప తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. ఇంట్లో ఉన్న వస్తువులు బియ్యం, బట్టలు తడిసి పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. అయితే గత ఏడాది కురిసిన వర్షాల నుంచి జీహెచ్ఎంసీ గుణపాఠం నెరవలేదు అనిపిస్తుంది. నాలాల పూడికతీత పూర్తి కాకపోవడంతో మళ్ళీ మునిగిపోయింది హైదరాబాద్.…
కొత్త పీసీసీ అధ్యక్షుడి కోసం సుదీర్ఘ కసరత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చివరకు రేవంత్ రెడ్డిని కొత్త చీఫ్‌గా నియమించింది… అయితే, ఆది నుంచి పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వచ్చిన.. పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. దీంతో.. పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి… పీసీసీ చీఫ్‌పై చర్చ జరిగిన ప్రతీసారి ఢిల్లీ వెళ్లి మరీ మంతనాలు జరిపిన కోమటిరెడ్డికి పదవి మాత్రం…
సీఎం కేసీఆర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ బహిష్కరించినా.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాత్రం హాజరుకావడం ఆస్తికరంగా మారింది.. అంతే కాదు.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి.. ఆయనకు అభినందనలు తెలిపారు.. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో మీరు తీసుకున్న రక్షణ చర్యలు దళిత వర్గాల్లో చర్చనీయాంశమైంది.. దళితుల్లో మీ మీద విశ్వాసం పెరిగిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మోత్కుపల్లి.. ప్రజల హృదయాల్లో శాశ్వతంగా…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరిని పొమ్మనకుండానే పోయేలా చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు స్వామిగౌడ్… మాజీమంత్రి ఏ. చంద్రశేఖర్ నివాసంలో కొందరు తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు.. స్వామిగౌడ్, యెన్నం శ్రీనివాసరెడ్డి, గాదె ఇన్నయ్య, బెల్లయ్య నాయక్, కపిలవాయి దిలీప్ కుమార్, బండి సదానంద్, రాములు నాయక్, రాణి రుద్రమ్మ తదితరులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏ ఉద్దేశ్యంతో సాధించుకున్నామో ఆ విధంగా కలలు సహకారం కావడంలేదన్నారు.. ఉద్యమంలో…
సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి సంబంధించి ప్రగతిభవన్ అఖిలపక్ష సమావేశం జరుగుతోంది.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు.. అయితే, ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాట్టు బీజేపీ ప్రకటించినా.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరు కావడం పెద్ద చర్చగా మారింది.. దీనిపై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి స్పందించారు.. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ నిర్ణయంపై మోత్కుపలి కి…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది… సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.. ఈ సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు, సీపీఐ, సీపీఐ(ఎం)ల నుంచి సీనియర్ దళిత నేతలు, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకులకు ఆహ్వానాలు వెళ్లగా.. ఈ సమావేశానిక టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం,…