ఉద్యోగాల పేరుతో ఆన్‌లైన్‌లో ఎరవేసి బాధితుల నుంచి అందినకాడికి దోచుకున్నారు కేటుగాళ్లు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫెస్బుక్ లో నకిలీ ఐడి క్రియేట్ చేసి టోకరా వేస్తున్నారు. తాజాగా విజయ్ రెడ్డి అనే నిరుద్యోగి.. ఐటీ ఉద్యోగం కోసం 8 లక్షల రూపాయలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం ఆ కేటుగాడి మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించారు. హైదరాబాద్ లింగంపల్లికి చెందిన నవీన్ కుమార్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు.