మంత్రి ఎర్రబెల్లితో వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశానని అన్నారు ఎల్ రమణ. సామాజిక తెలంగాణ కోసం కృషిచేయాలని కేసీఆర్‌కు చెప్పాన్నారు. తనతో కలిసి రావాలని సీఎం కేసీఆర్ కోరారన్నారు ఎల్ రమణ. టీఆర్‌ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని చెప్పారు. తన నుంచి సానుకూల నిర్ణయం ఉంటుందని సీఎం కేసీఆర్‌కు తెలిపారని అన్నారు ఎల్ రమణ. కాగా, ఇప్పటికే ఎర్రబెల్లితోనూ సుదీర్ఘ మంతనాలు జరిపారు ఎల్. రమణ.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. రాష్ట్రంలో టీడీపీకి మనుగడ కష్టమని భావిస్తోన్న ఆయన.. ఈ విషయంపై కార్యకర్తలతోనూ చర్చించి.. టీఆర్ఎస్‌లో చేరడమే సరైంది అనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా రమణ కారు ఎక్కడం ఖాయంగానే కనిపిస్తోంది.